AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Income Tax Rules: జీతాలు తీసుకునేవారికి షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. పెరగనున్న నిఘా

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయపు పన్ను నియమాలు అమల్లోకి రానున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారిపై ఇక తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇక అత్యధిక జీతాలు తీసుకునే ఉద్యోగులపై కూడా ఇవి ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా హెచ్‌ఆర్ఏ క్లెయిమ్స్ కష్టతరం కానున్నాయి.

New Income Tax Rules: జీతాలు తీసుకునేవారికి షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. పెరగనున్న నిఘా
Money
Venkatrao Lella
|

Updated on: Feb 24, 2026 | 4:05 PM

Share

జీతాలు తీసుకునేవారికి ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తుంది. హౌస్ రెంట్ అలవెన్స్(HRA) క్లెయిమ్స్ ప్రక్రియ మరింత కఠినతరం కానుంది. ఇక నుంచి హెచ్ఆర్ఏ క్లెయిమ్ కోసం అనేక కొత్త నియమాలను ఐటీ శాఖ తీసుకొస్తుంది. దీని వల్ల తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులకు చెల్లించే అద్దెను క్లెయిమ్ చేయడం కష్టం కానుంది. తప్పుడు మార్గాల ద్వారా హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేసేవారికి చెక్ పడనుంది. మోసపూరిత క్లెయిమ్స్‌ను అరికట్టేందుకు ఐటీ డిపార్ట్‌మెంట్ కొత్త రూల్స్ తీసుకొస్తుంది. ఏప్రిల్ నుంచి రానున్న కొత్త హెచ్‌ఆర్ఏ క్లెయిమ్ నియమాలు ఏంటి..? జీతాలు పొందేవారిపై ఎలా ప్రభావితం చూపనున్నాయి..? అనే విషయాలు చూద్దాం.

కొత్త రూల్స్ ఇవే..

-హెచ్‌ఆర్ఏ క్లెయిమ్ చేసేటప్పుడు ఇంటి యజమానితో ఉన్న సంబంధాన్ని వెల్లడించాల్సి ఉంటుంది

-అద్దె ఇంట్లో ఉంటున్నప్పుడు జీతం పొందే వ్యక్తులు హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు

-ఇక జీతం పొందే వ్యక్తి తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యుల యాజమాన్యంలోని ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఒప్పందం నిజమైనదే ఉండాలి

-బంధువు చట్టబద్దమైన యజమాని అయి ఉండటంతో పాటు అద్దె వాస్తవానికి చెల్లించాలి

-బంధువు నికర ఆదాయం మినహాయింపు పరిమితిని మించి ఉంటే అందుకున్న అద్దె వారి చేతుల్లో పన్ను విధించబడాలి.

-కొన్నిసార్లు తల్లిదండ్రులు, బంధువులకు అద్దె చెల్లించాల్సి ఉన్నప్పుడు డబ్బును బదిలీ చేయకుండానే అద్దె చెల్లించినట్లు పేర్కొంటున్నారు

-కొన్నిసార్లు అద్దెను నగదు రూపంలో చెల్లించినట్లు చూపుతున్నారు

-సరైన డాక్యుమెంటేషన్ లేని సమయంలో హెచ్‌ఆర్ఏ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది

-హెచ్ఆర్ఏ క్లెయిమ్ సమయంలో అద్దె రసీదులు, రెంటల్ అగ్రిమెంట్ కాపీలను మాత్రమే అడుగుతారు. డబ్బులు చెల్లించిన రుజువులను మాత్రం అడగరు. దీంతో తప్పుడు పత్రాలు సమర్పిస్తున్నారు.

-ఇప్పటినుంచి సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను ఎలక్ట్రానిక్ పద్దతిలో ప్రాసెస్ చేస్తారు. దీని వల్ల హెచ్‌ఆర్ఏ క్లెయిమ్స్ మాన్యువల్ విధానంలో పరిశీలిస్తారు. దీని వల్ల నకిలీ అద్దె క్లెయిమ్ వివరాలు బయడపతాయి

బంధువులకు చెలించే అద్దెపై ఎలా క్లెయిమ్ పొందాలంటే..?

-నగదు రూపంలో కంటే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, యూపీఐ లేదా చెక్ వంటి డిజిటల్ రూపంలో అద్దె చెల్లించాలి

-ఇక నగదు రూపంలో చెల్లిస్తుంటే మీ ఏటీఎం విత్ డ్రా, స్టేట్‌మెంట్ హిస్టరీని ఐటీ శాఖ పరిశీలిస్తుంది

-చెల్లుబాటు అయ్యే అద్దె చెల్లింపు రసీదులు, అగ్రిమెంట్ కాపీలు అవసరం

-ఇక అద్దె పొందుతున్న తల్లిదండ్రులు, బంధువులు అద్దె ద్వారా వచ్చే ఆదాయాన్ని ఐటీ రిటర్న్స్‌లో పొందుపర్చాలి

Follow Us