AP Weather Update: నైరుతి, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. బెంగాల్ నుండి ఉత్తర కోస్తా ఏపీ వరకు, కర్ణాటక నుండి మరట్వాడా వరకు ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో నేడు, రేపు తేలికపాటి జల్లులు పడనున్నాయి. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.