అంతర్వేది సముద్రంలో మత్స్యకారుల వలకు అరుదైన రబ్బర్ ఫిష్ చిక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద సుమారు ఒక కేజీ బరువున్న ఈ వింత చేపను గతంలో ఎన్నడూ చూడలేదని జాలర్లు తెలిపారు. మన దేశంలో ఈ చేపను తినరు, కానీ విదేశాలలో దీనికి డిమాండ్ ఉందని ఫిషరీస్ అధికారులు పేర్కొన్నారు.