AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఈ రాత్రికే ఆ డెడ్ లైన్.. మిస్ అయితే నష్టమే..

బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అలర్ట్.. మీరు ఏడాది పొడవునా అపరిమిత డేటా, కాలింగ్ కోసం చూస్తున్నారా? అయితే ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం BSNL ప్రవేశపెట్టిన అత్యంత ప్రజాదరణ పొందిన భారత్ కనెక్ట్ 26 ఆఫర్ గడువు నేటితో ముగుస్తోంది. రూ. 2626 లకే ఏడాది అంతా నిరంతర సేవలు అందించే ఈ ప్లాన్ విశేషాలేంటి? అనేది ఙప్పుడ తెలుసుకుందాం..

BSNL: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఈ రాత్రికే ఆ డెడ్ లైన్.. మిస్ అయితే నష్టమే..
Bsnl Bharat Connect 26 Offer Ends Today
Krishna S
|

Updated on: Feb 24, 2026 | 3:11 PM

Share

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. గత నెలలో అత్యంత ప్రజాదరణ పొందిన భారత్ కనెక్ట్ 26 ప్రత్యేక వార్షిక ప్లాన్ గడువు నేటితో ముగుస్తుందని ప్రకటించింది. నెట్‌వర్క్ అప్‌గ్రేడ్, 5G సేవల దిశగా వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ వార్షిక ప్లాన్ వినియోగదారులను ఎంతగానో ఆకర్షించింది.

రూ. 2,626 భారత్ కనెక్ట్ 26 ప్లాన్ విశేషాలు

  • ఈ ప్రత్యేక ఆఫర్ కింద రీఛార్జ్ చేసుకునే వారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి.
  • వ్యాలిడిటీ:పూర్తి 365 రోజుల చెల్లుబాటు.
  • దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్.
  • డేటా: ప్రతిరోజూ 2.6GB హై-స్పీడ్ డేటా.
  • SMS: రోజుకు 100 ఉచిత సందేశాలు.

అదనంగా ఉచిత జాతీయ రోమింగ్‌తో పాటు BiTV యాక్సెస్. దీని ద్వారా లైవ్ టీవీ ఛానెల్‌లు, OTT కంటెంట్‌ను ఫ్రీగా వీక్షించవచ్చు.

రూ. 2,799 ప్లాన్: ఎక్కువ డేటా కోరుకునే వారి కోసం..

రూ. 2,626 ప్లాన్‌తో పాటు, బీఎస్ఎన్ఎల్ మరో శక్తివంతమైన వార్షిక ప్లాన్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ధర: రూ. 2799 ప్లాన్‌లో రోజుకు 3GB డేటా వస్తుంది. వార్షిక రీఛార్జ్ కోరుకునే వారికి అధిక ఇంటర్నెట్ అవసరం ఉన్నవారికి ఇది సరైన ఎంపిక.

క్రికెట్ ప్రియుల కోసం కొత్త క్రికెట్ OTT యాడ్ ఆన్

ఐపీఎల్ 2026, టీ20 వరల్డ్ కప్ సందడి మొదలవుతున్న వేళ, బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక యాడ్ ఆన్ ప్యాక్ ప్రకటించింది. JioHotstar, SonyLIV, ZEE5 సబ్‌స్క్రిప్షన్ల యాక్సెస్ లభిస్తుంది. ఇందులఓ భాగంగా 90 రోజుల పాటు లైవ్ క్రికెట్ మ్యాచ్‌లతో పాటు లేటెస్ట్ వెబ్ సిరీస్‌లు, సినిమాలను చూడొచ్చు. దీనిని ఇప్పటికే ఉన్న ఏదైనా యాక్టివ్ ప్లాన్‌తో కలిపి వాడుకోవచ్చు. రూ.2626 ప్లాన్ పొందాలనుకునే వారు ఈ రోజు అర్ధరాత్రిలోపు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రేపటి నుండి ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు.

Follow Us