కర్ణాటకలోని రాయచూరు నగరంలో 12 అడుగుల భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. మామిడి సరస్సు సమీపంలో కనిపించిన ఈ పాము స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్నేక్ క్యాచర్ బసవరాజ్ దానిని సురక్షితంగా బంధించి, రాయచూరు శివారులోని మలియాబాద్ అడవిలో వదిలిపెట్టాడు.