AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Koratala Shiva: కొరటాల శివ బర్త్ డే.. అరుదైన ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..

డార్లింగ్ ప్రభాస్ తో మిర్చి మూవీ తీసి సూపర్ హిట్ అందుకున్నాడు కొరటాల శివ.. ఆ తర్వాత కొరటాల జర్నీ హిట్ మూవీస్ తీస్తూ.. టాప్ డైరెక్టర్‏గా కొనసాగుతున్నాడు.

Koratala Shiva: కొరటాల శివ బర్త్ డే.. అరుదైన ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..
Koratala Shiva
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2021 | 2:33 PM

Share

డార్లింగ్ ప్రభాస్ తో మిర్చి మూవీ తీసి సూపర్ హిట్ అందుకున్నాడు కొరటాల శివ.. ఆ తర్వాత కొరటాల జర్నీ హిట్ మూవీస్ తీస్తూ.. టాప్ డైరెక్టర్‏గా కొనసాగుతున్నాడు. ప్రముఖ రచయిత, నటుడు, డైరెక్టర్ పోసాని కృష్ణమురళికి కొరటాల శివ దగ్గరి బంధువు. ఆయన దగ్గరే రైటింగ్ నేర్చుకుని డైరెక్టర్ గా ఎదిగారు శివ. మహేశ్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చేసి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అటు జూనియర్ ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ చేసిన కొరటాల శివ..ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈరోజు (జూన్ 15న) కొరటాల శివ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు కొరటాల శివకి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు, హీరోయిన్స్ అందరూ కొరటాలకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న రామ్ చరణ్, శివతో రెండోసారి సెట్స్ పైకి వెళ్లబోతున్న ఎన్టీఆర్ చెప్పిన విషెస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ, చిరంజీవితో తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీలో రామ్ చరణ్ సిద్ద పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ కి బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ చెప్పడానికి ఆచార్య సెట్ లోని సిద్ద లుక్ లో.. కొరటాల శివ తో కలిసి ఉన్న పిక్ ని షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు రామ్ చరణ్.

ట్వీట్..

ఇక అటు ఎన్టీఆర్ కూడా కొరటాలని స్పెషల్ గా విష్ చేసాడు. “స్నేహానికి విలువ వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన ” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ టైం లోనే ఎన్టీఆర్ – కొరటాల శివలు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో వచ్చే సినిమా పాన్ ఇండియా లెవల్లో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.

ట్వీట్..

Also Read: Vijay Sethupathi : కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి.. తమిళనాడు సీఎం స్టాలిన్ కు రూ. 25 లక్షలు అందజేత

Actor Nani: మెగాఫోన్ పట్టిన నాని సిస్టర్.. ‘మీట్ క్యూట్’ అంటూ సినిమా మొదలు పెట్టేసిన నేచురల్ స్టార్..

Follow Us
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల