AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ డైరెక్టర్‌ను చూసి షాక్ అయ్యా.. పూనకం వచ్చినట్టు పని చేశాడు: రఘుబాబు

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని కమెడియన్ రఘుబాబు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ విలన్ గా తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు రఘుబాబు .

ఆ డైరెక్టర్‌ను చూసి షాక్ అయ్యా.. పూనకం వచ్చినట్టు పని చేశాడు: రఘుబాబు
Raghubabu
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2026 | 4:08 PM

Share

సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి తెచ్చుకున్నారు రఘుబాబు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ విలన్ గా తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి నటుడిగా అరంగేట్రం చేశారు రఘుబాబు. ఆయన తండ్రి గిరిబాబు సైతం నటుడు కావడం విశేషం. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గతంలో రఘుబాబు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. రఘుబాబు మాట్లాడుతూ ఓ హీరో గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రఘుబాబు మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఆఫర్స్ రాకపోవడంతో ఒక నాలుగు నెలల విరామం తీసుకున్నాను. ఆ సమయంలోనే ఆది సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపారు. ఆ రోజు ఆఫీస్‌కు వెళ్లిన రఘుబాబుకు సినిమా గురించి వివరించగా, జూనియర్ ఎన్టీఆర్ హీరో అని తెలిసిందట. ఆ సమయానికి తారక్ రెండు మూడు సినిమాలు పూర్తి చేసి, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో “స్టూడెంట్ నంబర్ వన్” చేస్తున్నారట.

“ఆది” చిత్రానికి దర్శకత్వం వహించిన వి.వి. వినాయక్ అప్పటికి కొత్తవారు, సాగర్ దగ్గర అసిస్టెంట్ మాత్రమే. నిర్మాత బెల్లంకొండ సురేష్ కూడా కొత్తవారే. హీరో మినహా మిగిలినవారంతా కొత్తవారే కావడం, తనకు సుదీర్ఘ విరామం ఉండటంతో రఘుబాబు మొదట కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. డేట్లు చెప్పమని కోరినప్పుడు, వినాయక్ స్వయంగా వచ్చి కథ చెప్పాలని పట్టుబట్టారట. గంటకు పైగా కూర్చోబెట్టి, సినిమా కథను, తన పాత్ర “గంగిరెడ్డి” రోల్ ను సీన్ టు సీన్ వివరించిన వినాయక్, ఈ సినిమా తర్వాత అందరూ తనను “గంగిరెడ్డి” అనే పిలుస్తారని చెప్పినప్పుడు రఘుబాబుకు షాక్ అయ్యారట.

షూటింగ్ మొదటి రోజునే వినాయక్ దర్శకత్వ ప్రతిభ రఘుబాబును ఎంతగానో ఆకట్టుకుంది. “గంగిరెడ్డి” పాత్ర మొదటి డైలాగ్ డెలివరీలో, కళ్ళలో గ్లిజరిన్ వేసి, కళ్ళు ఎర్రబడేలా చేసి, పెదవులు మాత్రమే కదలాలని, కనురెప్పలు కదపకుండా చెప్పాలని వినాయక్ ఇచ్చిన సూచనలు రఘుబాబుకు కొత్త అనుభవంగా అనిపించిందట. మానిటర్‌లో తన నటనను చూసుకున్నప్పుడు, తనకు తానే భయపడేంత తీవ్రంగా ఆ షాట్ ఉండటంతో, వినాయక్ దర్శకుడిగా ఎంత గొప్పవాడో ఆయనకు అర్థమైంది అన్నారు. ఆ రోజు నుండి సినిమా పూర్తయ్యే వరకు వినాయక్ పూనకంతో పనిచేశారని రఘుబాబు గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us