AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం.. అధికారులకు మొర పెట్టుకున్నా..

Caste Discrimination: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన పసుల సంగీత అనే ఎస్సీ మహిళ, బీర్పూర్ మండలం కోమనపల్లి గ్రామం ఎస్టీ కులానికి చెందిన బద్దీ పవన్‌ను డిసెంబర్ 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో అబ్బాయి తరపున కులం వారు ఆగ్రహానికి గురై తమను కుల బహిష్కరణ చేయడంతో పాటు శుభ అశుభ కార్యాలకు వెళ్లకుండా చేశారంటూ తెలిపారు.

ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం.. అధికారులకు మొర పెట్టుకున్నా..
Marriage
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 24, 2026 | 2:32 PM

Share

ఆదర్శ వివాహం చేసుకున్నందుకు ఆశీర్వదించాల్సిన పెద్దలే కుల బహిష్కరణ చేసి కక్ష సాధింపు చేపట్టారని ఓ జంట అధికారుల కు ఫిర్యాదు చేశారు. ఆదర్శ వివాహం చేసుకున్నందుకు ఆశీర్వదించాల్సిన పెద్దలే కుల బహిష్కరణ చేసి కక్ష సాధింపు చేపట్టారని ఓ జంట అధికారులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన పసుల సంగీత అనే ఎస్సీ మహిళ, బీర్పూర్ మండలం కోమనపల్లి గ్రామం ఎస్టీ కులానికి చెందిన బద్దీ పవన్‌ను డిసెంబర్ 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో అబ్బాయి తరపున కులం వారు ఆగ్రహానికి గురై తమను కుల బహిష్కరణ చేయడంతో పాటు శుభ అశుభ కార్యాలకు వెళ్లకుండా చేశారంటూ తెలిపారు. ఈ విషయమై గత నెలలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని కాబట్టి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకున్నారు. తమను గ్రామ పెద్దలు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.

సమాజంలో బతికించే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అందరిలాగా.. తమకు కూడా స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ప్రేమ జంట ఇచ్చిన పిర్యాదుపై.. అధికారులు విచారణకి ఆదేశించారు.

Follow Us