Post Office Jobs: పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు.. అర్హత 10వ తరగతి

Post Office Jobs: పోస్టల్‌ శాఖలో ఉద్యోగుల కోసం ఎదురు చూసేవారికి శుభవార్త. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌లో దరఖాస్తుల గడువు పొడిగించింది పోస్టల్‌ శాఖ. ఇండియా పోస్ట్‌ స్టాఫ్‌..

Post Office Jobs: పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు.. అర్హత 10వ తరగతి
Indian Postal Jobs
Follow us
Subhash Goud

|

Updated on: Jun 16, 2021 | 2:53 PM

Post Office Jobs: పోస్టల్‌ శాఖలో ఉద్యోగుల కోసం ఎదురు చూసేవారికి శుభవార్త. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌లో దరఖాస్తుల గడువు పొడిగించింది పోస్టల్‌ శాఖ. ఇండియా పోస్ట్‌ స్టాఫ్‌ కారు డ్రైవర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ పోస్టుల దరఖాస్తుల గడువు 2021 మే 26 వరకు ముగియగా, గడువు పొడిగించింది. జూన్‌ 25 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీసులో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల అర్హత.. 10వ తరగతి పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు మూడేళ్ల లైట్, హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు 2021 మే 26 నాటికి 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు లేదు.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్‌లో Recruitment సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకుంటే అందులోనే దరఖాస్తు ఫార్మాట్ ఉంటుంది. దరఖాస్తుల్ని పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా స్పీడ్‌పోస్ట్‌లో పంపాలి. స్పీడ్ పోస్టు ద్వారా వచ్చిన దరఖాస్తుల్నే స్వీకరిస్తారు.

ఇవీ  కూడా చదవండి

SBI SO Recruitment 2021: ఎస్బీఐ ఫైర్ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. జూన్ 28 చివరి తేదీ..

UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే