UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే

UIDAI Recruitment 2021: ఆధార్ కార్డు సేవలను అందిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది...

UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే
Follow us
Subhash Goud

|

Updated on: Jun 14, 2021 | 2:30 PM

UIDAI Recruitment 2021: ఆధార్ కార్డు సేవలను అందిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బెంగళూరు, ముంబై, గువాహతిలోని ప్రాంతీయ కార్యాలయాల్లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ప్రైవేట్ సెక్రెటరీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అకౌంటెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి. డిప్యూటేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. అయితే ఈ డిప్యూటేషన్ మూడు సంవత్సరాలు పాటు ఉంటుంది. సంస్థ అవసరాలను బట్టి ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు 2021 జూలై 16 చివరి తేదీ. ఇంకా రెండు రోజుల మాత్రమే ఉంది. అయితే ఆధార్‌ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తుల్ని పోస్టు ద్వారా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపించాలి. మొత్తం 25 ఖాళీలు ఉండగా అందులో డిప్యూటీ డైరెక్టర్- 3, సెక్షన్ ఆఫీసర్- 5, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 5, సీనియర్ అకౌంట్ ఆఫీసర్- 1, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్- 1, అకౌంటెంట్- 2, ప్రైవేట్ సెక్రెటరీ- 6, స్టెనో- 2 పోస్టులున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే సదరు వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఇవీ కూాడా చదవండి

District Jail Anantapuramu Recruitment: అనంత‌పురం జిల్లా జైలులో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..

ILBS Recruitment 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ అండ్ బిలియ‌రీ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. 90 ఖాళీలు, ఎవ‌రు అర్హులంటే..

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..