AP Govt jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకో గుడ్ న్యూస్ చెబుతోంది. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది...

AP Govt jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Govt Job Recruitment
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 16, 2021 | 3:40 PM

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకో గుడ్ న్యూస్ చెబుతోంది. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రెగ్యులర్ ప్రతిపదికన ఈ ఉద్యోగాలకు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ విభాగంలో ఈ నియామకాలను జరుగనున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌లో మొత్తం 453 ఖాళీలను  భర్తీ జరుగనుంది.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 453 ఉద్యోగలకు ప్రకటన జారీ చేసింది.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ఖాళీలు- అర్హతలు:

1. గైనకాలజీ విభాగంలో 269 ఖాళీలు  2.పీడియాట్రిక్స్ – 11 3.అనెస్తీషియా – 64 4. జనరల్ మెడిసిన్ – 30 5. జనరల్ సర్జన్ – 16 6. ఆర్థోపెడిక్స్ – 12 7. పాథాలజీ – 05 8. ఆప్తాల్మాలజీ – 09 9. రేడియాలజీ – 21 10. సైకియాట్రీ – 02 11. డెర్మటాలజీ – 06 12. ఈఎన్టీ(ENT) – 08

అర్హ‌త‌- వ‌య‌సు:

సంబంధిత విభాగాల్లో PG Degree / Diploma / DNB విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జూలై 1 నాటికి 42 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, Ex-service Menకు వయో పరిమితిలో మూడేళ్ల సడలింపు ఇచ్చారు.

ముఖ్య సమాచారం… 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ. 1500లను పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. వేయిని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5: 30 గంటల వరకు..

వెబ్‌సైట్‌: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://dmeaponline.com/ 

పోస్టల్ ద్వారా : 

ఏదైనా జాతీయ బ్యాంకులో ‘THE COMMISSIONER, AP VAIDYA VIDHANA PARISHAD’ పేరు మీద డీడీ తీసి పంపించాల్సి ఉంటుంది.  O/o.Commissioner, APVVP, 4th Floor, B-Block, Himagna Towers, Old NRI college buildings, Gollapudi, Vijayawada Rural, Krishna District, Andhra Pradesh-521225 చిరునామాకు చేరేలా పంపించాలి.

ఎంపిక ఇలా..

అకాడమిక్ మెరిట్, గతంలో పని చేసిన అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 53,500 వరకు వేతనం చెల్లించనున్నారు. మూడేళ్ల ప్రొహిబిషన్ పిరియడ్ అనంతరం వేతన పెంపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Smoke in Intercity Train: ఇంటర్‌ సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు..

రెండేళ్ల బుజ్జోడికి భద్రత.. 24×7 కంటికి రెప్పలా కాపాడుతున్న గుజరాత్‌ పోలీసులు

Violating Covid Rules: కరోనా సమయంలో నిర్మల్ జిల్లా అధికారుల విందు.. నిబంధనల ఉల్లంఘనపై స్థానికుల ఆగ్రహం

Petrol Diesel Price: వాహనదారులకు చుక్కలు.. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధర..

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.