DIC Recruitment 2021: డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
DIC Recruitment 2021: డిజటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు...
DIC Recruitment 2021: డిజటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు న్యూఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 16 ఖాళీలకు గాను.. సీనియర్ డెవలపర్ (03), డెవలపర్ (06), డిజైనర్ (02), సాఫ్ట్‌వేర్ టెస్టర్ కమ్ డెవలపర్ (02), సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ – క్లౌడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్(01), కంటెంట్ మేనేజర్/రైటర్ (02) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* సీనియర్ డెవలపర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. బీఈ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణత సాధించడంతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* డెవపలర్ ఖాళీలకు అప్లై చేసుకునే వారు.. బీఈ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణత సాధించడంతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* డిజైనర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు.. బ్యాచిలర్ డిగ్రీతో పాటు గ్రాఫిక్ డిజైనింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* సిస్టం అడ్మినిస్ట్రేటర్ (క్లౌడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* కంటెంట్ మేనేజర్/ రైటర్ ఖాళీలకు అప్లై చేసుకునే వారు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* పై పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను విద్యార్హతలు, వయసు, అకడమిక్ రికార్డ్, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ ఈమెయిల్/ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* అభ్యర్థులు పూర్తి వివరాలను dicadmin-hr@digitalindia.gov.in మెయిల్ చేయాల్సి ఉంటుంది.
* దరఖాస్తులకు చివరి తేదీగా 01.07.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు https://www.dic.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: AP Govt jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Post Office Jobs: పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు.. అర్హత 10వ తరగతి
SBI SO Recruitment 2021: ఎస్బీఐ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. జూన్ 28 చివరి తేదీ..