ఊర్ల మీద విరుచుకుపడ్డ ఏనుగుల మంద.. ఏకంగా 8 గుంపులు దాడి.. మైనర్‌ బాలిక సహా ఇద్దరు మృతి..

తెల్లవారు జామున 2 గంటల సమయంలో బాలిక తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. సుమారు ఎనిమిది ఏనుగుల గుంపు ఆవరణలోకి ప్రవేశించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించగా ఓ ఏనుగు ఇంట్లోకి ప్రవేశించి మైనర్ బాలికను తొక్కింది.

ఊర్ల మీద విరుచుకుపడ్డ ఏనుగుల మంద.. ఏకంగా 8 గుంపులు దాడి.. మైనర్‌ బాలిక సహా ఇద్దరు మృతి..
Elephant Herd
Follow us

|

Updated on: May 27, 2023 | 9:55 PM

ఒడిశాలో ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసింది. గ్రామాలపై విరుచుకుపడ్డ గజరాజులు విధ్వంసం సృష్టించాయి. ఒడిశాలో వేర్వేరు ప్రాంతాల్లో ఏనుగుల దాడి ఘటనల్లో మైనర్ బాలిక సహా ఇద్దరు మృతి చెందారు. సుమారు ఎనిమిది ఏనుగుల గుంపులు జనవాసాల్లోకి చొరబడ్డాయని స్థానికులు చెబుతున్నారు. వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించగా ఓ ఏనుగు ఇంట్లోకి ప్రవేశించి మైనర్ బాలికను ఏనుగు తొక్కిందని చెప్పారు. బాలాసోర్, నయాగర్, ఖుర్దా జిల్లాల్లో ఏనుగులు భయానకంగా దాడి చేశాయి.

సోరో బ్లాక్ పరిధిలోని సరాలియా చిత్రసుల్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఎనిమిదేళ్ల బాలికను ఏనుగు తొక్కి చంపింది. తెల్లవారు జామున 2 గంటల సమయంలో బాలిక తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. సుమారు ఎనిమిది ఏనుగుల గుంపు ఆవరణలోకి ప్రవేశించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించగా ఓ ఏనుగు ఇంట్లోకి ప్రవేశించి మైనర్ బాలికను తొక్కింది. కుటుంబ సభ్యులు మైనర్ బాలికను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని హుటాహుటినా అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారిన మృతురాలి తండ్రి సురేష్ దేవూరి క‌న్నీరు పెట్టుకున్నారు.

మరో ఘటనలో నయాగఢ్ జిల్లాలో ఏనుగు దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని రాన్ పూర్ బ్లాక్ లోని నతిమ్ గ్రామానికి చెందిన సత్యబాది బెహెరాగా గుర్తించారు. బెహెరా మరో ఇద్దరు సహచరులతో కలిసి పనికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వారిపై ఒక్క‌సారిగా ఏనుగుల గుంపు దాడికి పాల్ప‌డింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!