AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అకాల వర్షంతో విధ్వంసం.. పిడుగులు పడి 12 మంది మృతి.. ఆయా జిల్లాల్లో అధికారుల పర్యటన

రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఈదురు గాలులు, వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శుక్రవారం 79 మిమీ వర్షం కురిసింది. బొకారోలో 52.4 మిమీ, రాంచీలో 5.9 మిమీ వర్షం కురిసింది. గత రెండు రోజుల్లో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి మొత్తం 12 మంది మృత్యువాతపడ్డారు.

అకాల వర్షంతో విధ్వంసం.. పిడుగులు పడి 12 మంది మృతి.. ఆయా జిల్లాల్లో అధికారుల పర్యటన
Lightning Strike
Jyothi Gadda
|

Updated on: May 27, 2023 | 9:38 PM

Share

ఝార్ఖండ్‌లో పిడుగులు విధ్వంసం కొనసాగింది. గత రెండు రోజుల్లో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి మొత్తం 12 మంది మృత్యువాతపడ్డారు. ధన్‌బాద్, జెంషెడ్‌పూర్, గుమ్లా, చత్రా, హజారీ బాగ్, రాంచీ , బొకారో తదితర ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయని అధికారులు వెల్లడించారు. మే 26న ధన్‌బాద్ జిల్లా బర్వద్దా ఏరియాలో తల్లీకూతుళ్లు పిడుగుపాటుకు గురయ్యారు. జెంషెడ్‌పూర్ లోని భ్రగోరా, గుమ్లా జిల్లా చిరోఢి వద్ద ఇద్దరు ,లోహర్‌డగ్గా వద్ద ఒకరు చనిపోయారు. గురువారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చత్రా, హజారీబాగ్, రాంచీ, బొకారో, ఖుంతి జిల్లాల్లో ఒక్కొక్కరు వంతున , పాలము జిల్లాలో హుస్సేనాబాద్ లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఆయా జిల్లాల అధికారులు ఈ మరణాల వివరాలను పరిశీలించి తెలియజేస్తే ఆయా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడమౌతుందని ఎస్‌డిఆర్‌ఎస్ విభాగం తెలియజేసింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల వంతున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గత రెండు రోజుల్లో రాష్ట్రంలో ఈదురుగాలులు, మెరుపులు, పిడుగులతో వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి.

రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఈదురు గాలులు, వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జెంషెడ్‌పూర్‌లో శుక్రవారం 79 మిమీ వర్షం కురిసింది. బొకారోలో 52.4 మిమీ, రాంచీలో 5.9 మిమీ వర్షం కురిసింది. ఉత్తర బీహార్, ఉత్తర ఒడిశా నుంచి హర్యానా నుంచి సిక్కిం వరకు అల్పపీడన ద్రోణి కారణంగా ఝార్ఖండ్‌లో పిడుగల వాన కురిసిందని రాంచీ వాతావరణ విభాగం ఇన్ ఛార్జి అభిషేక్ ఆనంద్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి