Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒత్తైన జుట్టు కోసం ఈ ఆహారాలను తప్పనిసరిగా తినండి.. ఫాస్ట్‌గా మీ జడ పొడవు పెరుగుతుంది..

దీంతో హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. కివి మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు ఇది మన జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కివి పండులో మంచి మొత్తంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది జుట్టు పెరిగేందుకు దొహదపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

ఒత్తైన జుట్టు కోసం ఈ ఆహారాలను తప్పనిసరిగా తినండి.. ఫాస్ట్‌గా మీ జడ పొడవు పెరుగుతుంది..
Hair Mask
Follow us
Jyothi Gadda

|

Updated on: May 27, 2023 | 9:07 PM

ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితం ఒత్తిడి, ఉరుకుల పరుగులతో బిజీబిజీగా మారిపోయింది. దీంతో ఎక్కడలేని అనారోగ్య సమస్యలు ప్రజల్ని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఉబకాయం, బీపీ, షుగర్‌, ముఖంపై మచ్చలు, జుట్టు రాలిపోవటం వంటివి ప్రతిఒక్కరిలోనూ కనిపించే సాదారణ సమస్యలుగా మారిపోయాయి. పైగా అసలే ఈ ఎండాకాలంలో దుమ్ము, ధూళి, కాలుష్యం, ఎండలోని హానికరమైన కిరణాల ప్రభావం, చెమట వల్ల జుట్టు బాగా దెబ్బతింటుంది. ఇవి జుట్టు రాలడానికి కారణమవుతాయి. వీటితో పాటుగా శరీరంలో పోషకాలు లోపించడం వల్ల కూడా జుట్టు రాలే అవకాశం ఉంది. అయితే, జుట్టు రాలడానికి ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో పోషకాల లోపం కూడా ఒకటి. పరిష్కారం కోసం కొన్ని ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకుంటే.. మీ జుట్టు ఊడటం ఆగిపోయి పొడుగ్గా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం, అందమైన జుట్టుకోసం తీసుకోవాల్సిన ఆహారాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..

కేశ సౌందర్యం కోసం ఉసిరి జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరి జ్యూస్ మీ జుట్టుకు అద్భుతాలు చేస్తుంది. ఉసిరి జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. ఉసిరి జుట్టు రాలడాన్ని నిరోదించి కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది. జుట్టుకు పోషణ ఇచ్చే ఆహార పదార్థాల్లో బచ్చలికూర కూడా ఒకటి.  జుట్టు ఆరోగ్యం కోసం కూరగాయలు, పండ్లు కూడా అంతే ముఖ్యం. అందులో కీరదోసకాయ, కివి పండ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కీరదోసకాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తాయి. కీరదోసకాయల్లో ఉండే విటమిన్ ఎ సెబమ్ ఉత్పత్తిని సమతుల్యంగా ఉంచుతుంది. దీంతో హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యంగా ఉంటాయి.

కివి మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు ఇది మన జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కివి పండులో మంచి మొత్తంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది జుట్టు పెరిగేందుకు దొహదపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూరలో ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, కెరోటినాయిడ్లు, రాగి వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ జుట్టుకు చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..