కమ్‌బమ్‌ పట్టణంలో అరికంబన్‌ హల్‌చల్‌.. రోడ్లపై పరుగులు తీస్తూ గజరాజు విధ్వంసం.. వీడియోలు వైరల్‌

క‌మ్‌బ‌మ్ ప్రాంతంలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఆ ఏనుగుకు మ‌త్తు ఇవ్వాల‌ని ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం కుమిలీ ప్రాంతంలో తిరిగిన ఆ ఏనుగు ఇప్పుడు క‌మ్‌బ‌మ్ పట్ట‌ణంలో క‌నిపించింది. ఏనుగుకు ఉన్న రేడియో కాల‌ర్ ద్వారా దాని క‌ద‌లిక‌ల‌ను ప‌సిగడుతున్నారు అధికారులు.

కమ్‌బమ్‌ పట్టణంలో అరికంబన్‌ హల్‌చల్‌.. రోడ్లపై పరుగులు తీస్తూ గజరాజు విధ్వంసం.. వీడియోలు వైరల్‌
Elephant
Follow us

|

Updated on: May 27, 2023 | 8:54 PM

అరికంబ‌న్ అనే ఏనుగు క‌మ్ బ‌మ్ ప‌ట్ట‌ణంలోకి ప్ర‌వేశించింది. త‌మిళ‌నాడులోని ఇడుకుడిలోని చిన్న‌కెనాల్ నుంచి అది పెరియార్ టైగ‌ర్ రిజర్వ్ ఫారెస్టులోకి ప్ర‌వేశించింది. క‌మ్‌బ‌మ్ ప‌ట్ట‌ణంలోకి ప్ర‌వేశించిన ఆ ఏనుగు.. ఇండ్ల మ‌ధ్య ప‌రుగులు తీసింది. దీంతో స్థానిక ప్ర‌జ‌లు భయాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. అరికంబన్‌ నగరంలోని రోడ్ల వెంట పరుగెత్తుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏనుగు విధ్వంసానికి భయపడిపోయిన స్థానికులు పెద్ద పెద్ద శబ్ధాలు చేయడంతో అది మరింతగా రెచ్చిపోయి పరుగులు తీసింది. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో వైర‌ల్ అయ్యింది.

ఏనుగు నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. అందులో ఒక‌రి ప‌రిస్థితి క్రిటిక‌ల్‌గా ఉంది. ప‌ట్ట‌ణంలోకి ప్ర‌వేశించిన గ‌జ‌రాజు.. అనేక ఆటోరిక్షాలు, టూవీల‌ర్ల‌ను ధ్వంసం చేసింది. కొబ్బ‌రితోట‌లు ఉన్న క‌మ్‌బ‌మ్ ప్రాంతంలోకి అది ప్ర‌వేశించిన‌ట్లు అనుమానిస్తున్నారు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులోని క‌మ్‌బ‌మ్ ప్రాంతంలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఆ ఏనుగుకు మ‌త్తు ఇవ్వాల‌ని ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం కుమిలీ ప్రాంతంలో తిరిగిన ఆ ఏనుగు ఇప్పుడు క‌మ్‌బ‌మ్ పట్ట‌ణంలో క‌నిపించింది. ఏనుగుకు ఉన్న రేడియో కాల‌ర్ ద్వారా దాని క‌ద‌లిక‌ల‌ను ప‌సిగడుతున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 29న చిన్నకనాల్ నుంచి అరికంబన్‌కు మత్తు మందు ఇచ్చి పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంలోని మెతకనం సమీపంలో వదిలేశారు. రెండు వారాల క్రితం మెతకానం నుంచి తమిళనాడులోని మేఘమాలలోకి ప్రవేశించిన ఏనుగు జనావాసాల్లోకి ప్రవేశించింది. అనంతరం అదే మార్గంలో తిరిగి మెతకనాథ్‌కు వచినట్టుగా అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మరో 3 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మరో 3 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు