మరో ప్రపంచం పిలిచింది..! క్యాషియర్ ఉద్యోగం వదిలేసి అడవిలోనే మకాం.. తెగ ఫాలో అవుతున్న నెటిజనం..
రాబర్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మందికి పైగా ఫాలో అవుతున్నారు. అక్కడ ఎలాంటి పురుగుమందులు వాడకుండా తన ఆహారాన్ని తానే ఎలా పండించుకుంటున్నాడో ప్రజలకు చెబుతున్నాడు. పట్టణీకరణకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పారు. అందువలన అతను
ప్రస్తుత కాలంలో ప్రజల జీవన విధానం మారిపోయింది. నిత్యం హడావుడి జీవితం గడపడం వారికి అలవాటైపోయింది. కాబట్టి, ప్రశాంతమైన, స్థిరమైన జీవితం ఎలా ఉంటుందో నేటి తరం చాలా మందికి తెలియదు. నగర ప్రజల జీవితం మరింత గజిబిబి గందరగోళం.. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు ఎంత మంచిదో అలాంటి వారు చాలా మందికి తెలియదు. వారంతా కాంక్రీట్ జంగీల్‌లో కంప్యూటర్లతో గడుపుతున్నారు. అయితే, అమెరికా అనే భూతలస్వర్గంలో ఉండలేక ఒక సగటు పౌరుడు ప్రకృతి ఒడిలోకి చేరుకున్నాడు. లక్షలు సంపాదించే ఉద్యోగం వదిలేసి కారడవిలో కాపురం పెట్టేశాడు. ఆ అడవిలోనే పర్యావరణహితంగా ఓ ఇంటిని నిర్మించుకున్నాడు. వాననీటిని వాడుకుంటూ, ఆర్గానిక్ పంటలు పండించుకుంటూ హాయిగా బతుకున్నాడు. ఇతడి జీవనశైలి వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన 35 ఏళ్ల రాబర్ట్ బ్రెటన్- కాలిఫోర్నియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక సూపర్ మార్కెట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగం, జీవితం బాగానే సాగుతోంది. అతను ప్రకృతికి దగ్గరగా ఉన్నట్లు భావించలేకపోయాడు. అందుకే ఉద్యోగం మానేసి హవాయికి వెళ్లి అడవిలో జీవించడం మొదలుపెట్టాడు (Man left job in city live in jungle). 2011 నుంచి ఇలాగే జీవిస్తున్నాడు. ఆ సమయంలో అతను అమెరికాలోని దాదాపు ప్రతి ప్రాంతానికి వ్యాన్‌లో ప్రయాణించాడు. హవాయి అడవిలో తన ప్రత్యేకమైన ఇంటిని నిర్మించుకోవడానికి ఉత్తమమైన స్థలం కోసం చాలా వెతికాడు. చివరకు రూ.24 లక్షల 65వేలు ఖర్చుపెట్టి భూమి కొన్నాడు. అక్కడే ఇల్లు కట్టుకుని, వాననీటిని వాడుకుంటూ, ఆర్గానిక్ పంటలు పండించుకుంటూ బతుకున్నాడు. ఇప్పుడు తన పాత జీవితానికి సంబంధించిన ఏదీ గుర్తుకు రావడం లేదని అంటున్నారు. రాబర్ట్ తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇతడి జీవనశైలి వీడియోలను జనం తెగ చూస్తున్నారు.
View this post on Instagram
రాబర్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మందికి పైగా ఫాలో అవుతున్నారు. అక్కడ ఎలాంటి పురుగుమందులు వాడకుండా తన ఆహారాన్ని తానే ఎలా పండించుకుంటున్నాడో ప్రజలకు చెబుతున్నాడు. పట్టణీకరణకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పారు. అందువలన అతను ప్రకృతికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా వీడియోలలో, అతను వ్యవసాయం చేస్తూ, బీచ్‌లో కూర్చుని చేపలు పట్టుకుంటూ కనిపిస్తాడు. సోషల్ మీడియాకు కనెక్ట్ అయితే సిటీ లైఫ్ ను పూర్తిగా వదిలేసినట్లేనని పలువురు విమర్శిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..