AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అప్పట్లో పండిట్ నెహ్రూ.. ఇప్పట్లో నరేంద్రమోడీ.. మఠాధిపతుల ఆశీర్వాదంతో ‘రాజదండం’ స్వీకరణ

రాజ దర్బార్లు, మహా సింహాసనాలు, స్వర్ణ మకుటాలు..ఇటువంటివన్నీ ఎప్పుడో అంతరించిపోయిన రాజరికపు ఆనవాళ్లు. చరిత్ర పుస్తకాల్లో మాత్రమే చదువుకుంటాం. సినిమాలుగా వస్తే తెరమీద చూసుకుని ఆస్వాదిస్తాం. కానీ..అలనాటి అరుదైన ఘట్టాల్ని, గురుతుల్ని రియాలిటీలో కూడా రీకాల్..

PM Modi: అప్పట్లో పండిట్ నెహ్రూ.. ఇప్పట్లో నరేంద్రమోడీ.. మఠాధిపతుల ఆశీర్వాదంతో 'రాజదండం' స్వీకరణ
Pm Modi
Subhash Goud
|

Updated on: May 28, 2023 | 4:00 AM

Share

రాజ దర్బార్లు, మహా సింహాసనాలు, స్వర్ణ మకుటాలు..ఇటువంటివన్నీ ఎప్పుడో అంతరించిపోయిన రాజరికపు ఆనవాళ్లు. చరిత్ర పుస్తకాల్లో మాత్రమే చదువుకుంటాం. సినిమాలుగా వస్తే తెరమీద చూసుకుని ఆస్వాదిస్తాం. కానీ..అలనాటి అరుదైన ఘట్టాల్ని, గురుతుల్ని రియాలిటీలో కూడా రీకాల్ చేసుకుంటోంది మోదీ సర్కార్‌. ఆ సంకల్పం నుంచి పుట్టిందే రాజదండం. అప్పట్లో పండిట్ నెహ్రూ..ఇప్పట్లో నరేంద్రమోదీ.. వీళ్లిద్దరికి మాత్రమే రాజదండం తీసుకునే అదృష్టం దక్కింది. తాజాగా తమిళనాడుకు చెందిన ఆధీనమ్‌ల ఆశీర్వాదాలతో రాజదండాన్ని స్వీకరించారు ప్రధాని మోదీ.

ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు నుంచి వచ్చిన మఠాధిపతుల నుంచి అత్యంత పవిత్రమైన రాజదండాన్ని స్వీకరించారు. మోదీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆధీనమ్‌లు ఆయనను వేదమంత్రాలతో ఆశీర్వదించి, ఈ రాజదండాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తమిళనాడులోని ధర్మపురం, పళని, విరుధాచలం, తిరుకోయిలూర్, తిరువడుతురైల నుంచి దాదాపు 21 మంది మఠాధిపతులు డిల్లీకి వచ్చారు. వీరు మోదీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన్ని ఆశీర్వదించి, సెంగోల్‌ను అందజేశారు. దీనిని నూతన పార్లమెంటు భవనంలో లోక్‌సభ సభాపతి ఆసనం వద్ద ప్రతిష్ఠిస్తారు.

అధికార మార్పిడికి గుర్తుగా 400 ఏళ్ల కిందట తిరువడుత్తురై అథీనం మఠాధిపతుల సమక్షంలో మద్రాస్‌లోని స్వర్ణకారుడి చేత ఈ రాజదండాన్ని సిద్ధం చేయించారు. దీని పొడవు 5 అడుగులు ఉండగా..పై భాగంలో నంది చిహ్నన్ని న్యాయానికి ప్రతీకగా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ మఠానికి చెందిన స్వామీజీ ఒకరు ఆ దండాన్ని మొదట మౌంట్‌బాటన్‌కు అందించి, తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత గంగాజలంతో శుద్ధి చేసి, నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు రాజదండాన్ని భారత నూతన ప్రధాని నెహ్రూకు అందజేశారని చరిత్ర చెబుతోంది.

ఇవి కూడా చదవండి

తమిళనాడు నుంచి ఇంతమంది మఠాధిపతులు వచ్చి తమను ఆశీర్వదించడం మరపురాని విషయమన్నారు ప్రధాని మోదీ. దేశ సేవలో తమిళనాడు పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. కాంగ్రెస్‌ హయాంలో చరిత్రాత్మక సెంగోల్‌కు తగిన గౌరవం ఇవ్వకపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మార్పిడికి గుర్తుగా బ్రిటిష్‌ ప్రభుత్వం అందజేసిన రాజదండాన్ని ఓ చేతికర్ర మాదిరిగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మ్యూజియంలో భద్రపరిచిందని విమర్శించారు.

పారాడబ్‌- స్వాతంత్ర్యానంతరం పవిత్ర సెంగోల్‌కు తగిన గౌరవం ఇచ్చి, ఉన్నత స్థానం కల్పించి ఉంటే బాగుండేది. కానీ, దీనిని ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్‌ భవన్‌లో చేతికర్రలా భద్రపరిచారు. మీ సేవకుడిగా నేను, మన ప్రభుత్వం ఆ అపురూప గుర్తును అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చింది. స్వాతంత్ర్యానికి గుర్తుగా ఇచ్చిన సెంగోల్‌ను కొత్త పార్లమెంట్‌ భవనంలో ప్రతిష్ఠించే అవకాశం లభించింది.

రాజదండాన్ని జాతీయ చిహ్నంగా చేయాలని ప్రధాని నిర్ణయం

ఈ రాజదండం ధర్మబద్ధ, న్యాయ పాలనకు చిహ్నంమన్నారు ప్రధాని మోదీ. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయి, 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేందుకు పరుగులు తీస్తున్న అమృతకాలంలో ఈ రాజదండాన్ని జాతీయ చిహ్నంగా చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
ఉచిత విద్య, వసతి, భోజనం.. వేద విద్యపై ఆసక్తి ఉన్నవారికి గోల్డెన్
ఉచిత విద్య, వసతి, భోజనం.. వేద విద్యపై ఆసక్తి ఉన్నవారికి గోల్డెన్