New Parliament Opening Ceremony: కర్తవ్యం, సేవలకు సెంగోల్ ప్రతీక.. మోదీ చేతుల మీదుగా భవన ఆవిష్కృత ఘట్టం..
New Parliament building inauguration Live Updates in Telugu: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అయ్యింది. సరిగ్గా ఆదివారం ఉదయం ఏడున్నరకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ప్రధాని మోదీకి చేతుల మీదుగా పార్లమెంట్ ప్రారంభోత్సవం జరిగింది.

భారత కొత్త పార్లమెంట్ ఆవిష్కృతం అయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతోంది. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని రెండు దశలుగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే పాత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పూజ కార్యక్రమాలు చేపడుతారు. ఉదయం 7.30 గంటలకు పూజ కార్యక్రమం ఉంటుంది. ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సహా పలువురు సీనియర్ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
పూజ తరువాత అందరూ లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్లను సందర్శిస్తారు. ఉదయం 9.30గంటలకు లోక్‌సభ స్పీకర్ కుర్చీ కుడి పక్కన రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పాటు సెంగోల్ రూపకర్తలు సైతం హాజరుకానున్నారు. తరువాత పూజ కార్యక్రమం ఉంటుంది.
తమిళనాడు లోని తిరువాదుతురై అధీనంతో సహా 20 ఆధీనాలకు చెందిన మఠాధిపతులు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథులుగా హాజరవుతున్నారు. తిరువాదుతురై అధీనం మఠాధిపతి ప్రధాని మోదీకి రాజదండాన్ని అప్పగిస్తారు.
మఠాధిపతులతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ.
మధ్యాహ్నం జాతీయ గీతాలాపనతో రెండో దశ ప్రారంభ వేడుకలు మొదలుకానున్నాయి. లోక్‌సభ ఛాంబర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా అతిథులు హాజరుకానున్నారు. పార్లమెంట్ నిర్మాణం సమయంలోని అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తారు. చివరగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
లైవ్ కోసం ఇక్కడ చూడండి
ప్రధాని మోదీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభిస్తున్న సందర్భానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం రూ.75 విలువైన స్మారక నాణెంను విడుదల చేయనుంది.
LIVE NEWS & UPDATES
-
ఎన్నో ఆటంకాలను దాటుతూ భారత్ అమృతోత్సవ వేళకు చేరుకుంది – ప్రధాని మోదీ
స్వాతంత్ర్య తర్వాత భారత్ కొత్త యాత్ర ప్రారంభించిందన్నారు ప్రధాని మోదీ. ఎన్నో ఆటంకాలను దాటుతూ భారత్ అమృతోత్సవ వేళకు చేరుకుందన్నారు. అమృతోత్సవ వేళ మరింత పురోభివృద్ధి దిశగా పయనించాలన్నారు. అమృతోత్సవ కాలం దేశానికి కొత్త మార్గాన్ని సూచిస్తుందన్నారు. ప్రధానిప్రజల ఆశలు, ఆకాంక్షలు, కలలను సాకారం చేసుకోవాలన్నారు. ముక్త భారత్ కోసం నవీన పంథా కావాలన్నారు. కొత్త భవనం భారత భవిష్యత్తును మరింత ఉజ్వలం చేస్తుందన్నారు ప్రపంచ యవనికలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 21వ శతాబ్దపు కొత్త భారతదేశం ఉన్నత స్ఫూర్తితో నిండిన భారతదేశం, అది బానిసత్వ ఆలోచనను వదిలివేస్తోందన్నారు. పార్లమెంటు కొత్త భవనం ఈ ప్రయత్నానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు ప్రధాని మోదీ.
-
ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ నిర్మాణం.. – ప్రధాని మోదీ
ఈరోజు కొత్త పార్లమెంటు భవనాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వంతో నిండిపోతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందులో వాస్తుశిల్పం, వారసత్వం, కళ, నైపుణ్యం, సంస్కృతి, రాజ్యాంగం కూడా ఉన్నాయి. లోక్‌సభ లోపలి భాగం జాతీయ పక్షి నెమలిపై, రాజ్యసభ లోపలి భాగం జాతీయ పుష్ప కమలంపై నమూనలో ఉంటుంది. పార్లమెంట్ ఆవరణలో జాతీయ వృక్షం మర్రి చెట్టు కూడా ఉందన్నారు.
-
-
గడిచిన 9 ఏళ్లుగా నవ నిర్మాణం కోసం.. - ప్రధాని మోదీ
గడిచిన 9 ఏళ్లుగా నవ నిర్మాణం, పేదల సంక్షేమం కోసం కృషి చేశామన్నారు ప్రధాని మోదీ. 9 ఏళ్లలో గ్రామాలను కలుపుతు 4 లక్షల కి.మీ. రోడ్లు వేశామన్నారు.
-
రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుంది.. - ప్రధాని మోదీ
పాత పార్లమెంట్ భవనంలో అనేక ఇక్కట్లు ఎదురయ్యేవని గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ. అంతేకాదు కూర్చోవడానికే కాదు.. సాంకేతికంగానూ అనేక సమస్యలు వచ్చేవన్నారు ప్రధాని మోదీ. రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుందన్నారు. దానికి తగ్గట్టుగానే ఆధునిక వసతులతో కొత్త భవనం నిర్మించామన్నారు.
-
బానిసత్వ ఆలోచనను వదిలి.. - ప్రధాని మోదీ
21వ శతాబ్దంలో భారత్ ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుంది. దేశం బానిస వాసనలను వదిలిపెట్టి ముందుకెళ్తోంది. పార్లమెంటు కొత్త భవనం ఈ ప్రయత్నానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు ప్రధాని మోదీ.
-
-
ఇది కేవలం భవనం.. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష - టేకింగ్
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం అమృత మహోత్సవ్‌ను జరుపుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు ప్రధాని మోదీ. ఈ ఉదయం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో సర్వ విశ్వాస ప్రార్థన జరిగింది. ఈ సువర్ణ క్షణానికి దేశప్రజలందరినీ అభినందిస్తున్నాను. ఇది కేవలం భవనం మాత్రమే కాదు.. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబం అని ప్రధాని మోదీ అభివర్ణించారు.
-
భారత్ ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి జనని - ప్రధాని మోదీ
భారత్ ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి జనని అని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఎక్కడైనా ఆగిపోతే అభివృద్ధి అక్కడే ఆగిపోతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ముందుకెళ్తూనే ఉండాలన్నారు. ఆజాదీకా అమృతకాలం.. దేశానికి కొత్త దిశను నిర్దేశించే కాలం అన్నారు. కొత్త భారతావనికి ఆజాదీకా అమృతకాలం మార్గం కావాలన్నారు.
-
స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసే సాధనంగా.. - ప్రధాని మోదీ
ఈ కొత్త భవనం మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసే సాధనంగా మారుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ కొత్త భవనం స్వావలంబన భారత్ సూర్యోదయానికి సాక్ష్యంగా నిలిచిందన్నారు. ఈ కొత్త భవనం అభివృద్ధి చెందిన భారత్ తీర్మానాల నెరవేర్పును చూస్తుంది. కొత్త మార్గాలలో నడవడం ద్వారా మాత్రమే కొత్త నమూనాలు సృష్టించబడతాయి. నేడు నవ భారత్ కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తోంది. కొత్త ఉత్సాహం, కొత్త ఉత్సాహం, కొత్త దిశ, కొత్త దృష్టి మొదలైందన్నారు.
-
లోక్‌సభలో పవిత్ర సెంగోల్..
కొత్త పార్లమెంటు లోక్‌సభలో పవిత్ర సెంగోల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. పవిత్ర సెంగోల్ తన గౌరవం తిరిగి లభించిందన్నారు. సాధువుల ఆశీస్సులతోనే మనం పవిత్ర సెంగోల్‌కు దాని గౌరవాన్ని తిరిగి ఇవ్వగలిగామని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యం మనకు ఒక ఆలోచన, ఒక సంప్రదాయం, భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి, పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం అన్నా ప్రధాని మోదీ.
-
భారతదేశ దిశ కొత్తదని..
ఈ భవన ప్రారంభోత్సవంతో భారతదేశ దిశ కొత్తదని, దార్శనికత కొత్తదని, స్పష్టత కొత్తదని ప్రపంచానికి తెలిసిపోయిందని ప్రధాని మోదీ అన్నారు.
-
ప్రపంచం మొత్తం భారత్ వైపు ఆశతో చూస్తోంది - ప్రధాని మోదీ
ప్రపంచం మొత్తం భారత్ వైపు ఆశతో చూస్తోందని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచానికి దిశానిర్దేశం చేసేందుకు భారత కొత్త పార్లమెంటు పని చేస్తుందన్నారు. ఎందుకంటే భారతదేశం ముందుకు వెళితే ప్రపంచం ముందుకు సాగుతుందని ప్రపంచానికి తెలుసన్నారు ప్రధాని మోదీ.
-
నిర్మాణాన్ని పాలసీతో అనుసంధానించడానికి..
140 కోట్ల మంది ప్రజల కలలకు ప్రతిబింబం పార్లమెంటు భవనం. ఇది పాలసీని నిర్మాణానికి లింక్ చేస్తుంది. రిజల్యూషన్‌ని అచీవ్‌మెంట్‌తో కనెక్ట్ చేయడానికి ఇది లింక్. అమృతకల్‌లో ప్రజలకు కొత్త పార్లమెంటు బహుమతి.
-
దేశ అభివృద్ధి ప్రయాణంలో కొన్ని క్షణాలు - ప్రధాని మోదీ
కొత్త పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి ప్రయాణంలో కొన్ని క్షణాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.
-
విడుదలైన రూ.75 నాణెం
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం అనంతరం రూ. 75 నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక స్టాంపు టికెట్‌ను కూడా విడుదల చేశారు.
-
తపాలా స్టాంపును విడుదల చేసిన ప్రధాని మోదీ
పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా కొత్త తపాలా స్టాంపును ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సహా ఇతర నేతలు విడుదల చేశారు.
-
అమృతోత్సవ వేళ చరిత్రాత్మక ఘట్టం - ఓంబిర్లా
అమృతోత్సవ వేళ చరిత్రాత్మక ఘట్టానికి పార్లమెంటు సాక్షిగా నిలిచిందన్నారు ఓంబిర్లా. ప్రధాని దృఢ సంకల్పంతో నూతన పార్లమెంటు భవనం సాకారమైందన్నారు. వేలాది కార్మికుల కృషితో రెండున్నరేళ్లలోనే భవనం పూర్తైందన్నారు. దేశ ప్రజల సంకల్పంతో కరోనా విపత్తు నుంచి గట్టెక్కిందన్నారు.
-
లోక్‌సభ స్పీకర్ మాట్లాడుతూ..
నూతన పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. కేవలం రెండున్నరేళ్లలో దేశ పార్లమెంట్‌ను ఆయన దర్శకత్వంలో నిర్మించడం వల్ల ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఇది ఆయన నాయకత్వ తీవ్రతను తెలియజేస్తోందన్నారు.
The entire nation is witnessing this moment today. I express my gratitude towards PM Modi under whose leadership this new Parliament was built in under 2.5 years: Lok Sabha Speaker Om Birla in the new Parliament pic.twitter.com/3Mgt8kzxCT
— ANI (@ANI) May 28, 2023
-
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సందేశం..
దేశ ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ శుభాకాంక్షల సందేశాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చదివి వినిపించారు. కొత్త పార్లమెంట్‌కు దేశప్రజలకు అభినందనలు తెలిపిన ఆయన, దేశ పార్లమెంటును ప్రజాస్వామ్యానికి మూలాధారంగా అభివర్ణించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సందేశం చదివి వినిపించారు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్. అమృతోత్సవ వేళ నిర్మించిన భవనం ప్రేరణగా నిలుస్తుందన్నారు. నూతన భవనంలో దేశ ఉజ్వల భవిష్యత్తుకు నిర్ణయాలు జరుగుతాయన్నారు. మున్ముందు ప్రపంచ యవనికపై భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. ప్రపంచానికి నేతృత్వం వహించే విధంగా భారత్ మారుతుందన్నారు.
-
రెండో దశ ప్రారంభోత్సవ వేడుక..
కొత్త పార్లమెంట్ రెండో దశ ప్రారంభోత్సవం కొనసాగుతోంది. కొత్త పార్లమెంట్‌కు ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. కాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు
-
అందుకే నిర్మించారు - రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
రానున్న కాలంలో డీలిమిటేషన్ వల్ల సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం, పార్లమెంట్ బాధ్యతలు పెరుగుతున్న నేపథ్యంలో స్థలాభావం ఏర్పడుతోందని కొత్త పార్లమెంట్ హౌస్‌లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అన్నారు. ప్రస్తుత పార్లమెంటు భవనంలో.. కొత్త భవనాన్ని నిర్మించాలని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ప్రధానిని కోరారు.
-
రెండో దశ షెడ్యూల్ ఇలా..
12గంటల10 నిమిషాలకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్‌ల సందేశాలను ఆయన చదవనున్నారు. 12గంటల 38 నిమిషాలకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రసంగిస్తారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకొని ఒంటి గంట సమయంలో 75రూపాయల నాణేన్ని, స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. ఆ తర్వాత... ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.
-
ఇది ప్రజాస్వామ్య దేవాలయం.. - కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
పాత పార్లమెంట్ హౌస్‌లో పనిచేశామని, ఇప్పుడు కొత్త పార్లమెంట్‌లో కూడా పనిచేయడం మన అదృష్టమని అన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. దేశంలో ఏది మంచిదంటే అది కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. ఇది ప్రజాస్వామ్య దేవాలయం, మేము దీనిని చాలా గౌరవిస్తామని అన్నారు.
-
నూతన పార్లమెంట్ హౌస్‌లో చాణక్య, అఖండ భారత్ చిత్రాలు..
భారత కొత్త పార్లమెంట్ హౌస్ లోపల చాణక్య, అఖండ భారత్ చిత్రం ఏర్పాటు చేశారు.
-
సెంట్రల్ హాల్‌లో వీర్ సావర్కర్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ
కొత్త లోక్‌సభను ప్రారంభించిన తర్వాత.. లోక్‌సభ స్పీకర్, ఇతర మంత్రులతో కలిసి సెంట్రల్ హాల్‌కు వెళ్లి వీర్ సావర్కర్‌కు నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ.
-
పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఇలా కనిపించారు
కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చాలా భిన్నమైన శైలిలో కనిపించారు. ప్రధాని మోదీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
PM Narendra Modi installed the historic 'Sengol' in the Lok Sabha chamber of the new Parliament building today pic.twitter.com/Ow5TCbUMoT
— ANI (@ANI) May 28, 2023
-
ఇది మన 'నవ భారతదేశం' .. షారుఖ్ ఖాన్ ట్వీట్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భారతదేశంలో కొత్తగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని కొనియాడారు. ఇందుకు తన ట్విట్టర్ వేదికగా.. కొత్త పార్లమెంట్ భవనాన్ని పూర్తిగా చూపించే వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోకు షారుఖ్.. ఇలా చెప్పుకొచ్చారు.. "మన రాజ్యాంగాన్ని సమర్థించే, ఈ గొప్ప దేశంలోని ప్రతి పౌరుడికి ప్రాతినిధ్యం వహించే, రక్షించే వ్యక్తులకు ఎంత అద్భుతమైన కొత్త ఇల్లు. .. గ్లోరీ ఫర్ ఇండియా ఏజ్ ఓల్డ్ డ్రీమ్,” అంటూ షారుఖ్ ఖాన్ ట్వీట్ చేసారు. అలాగే ఇది మన 'నవ భారతదేశం' కోసం అని తాను షేర్ చేసిన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో షారుఖ్ వీడియోను షేర్ చేస్తూ.. తమ అభిప్రాయాలను కూడా పంచుకుంటున్నారు.
ఆ ట్వీట్ ఇక్కడ చూడండి..
What a magnificent new home for the people who uphold our Constitution, represent every citizen of this great Nation and protect the diversity of her one People @narendramodi ji.
A new Parliament building for a New India but with the age old dream of Glory for India. Jai Hind!… pic.twitter.com/FjXFZwYk2T— Shah Rukh Khan (@iamsrk) May 27, 2023
-
ప్రధాని మోదీ చేతుల మీదుగా..
నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నూతన పార్లమెంటు భవన నిర్మాణ కార్మికులకు సన్మానించారు. కార్మికులను శాలువాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు ప్రధాని మోదీ.
- Parliament Building Inauguration
-
'సర్వ-ధర్మ' ప్రార్థనలు..
పార్లమెంట్ భవన నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను సత్కరించారు ప్రధాని మోదీ. అనంతరం 'సర్వ-ధర్మ' ప్రార్థనలు నిర్వహించారు. అన్ని మతాల మత పెద్దలు తమ విశ్వాసానికి సంబంధించిన మంత్రాలను పఠిస్తున్నారు.
Delhi | PM Modi along with Lok Sabha Speaker Om Birla and Cabinet ministers attends a 'Sarv-dharma' prayer ceremony being held at the new Parliament building pic.twitter.com/lfZZpTDMHx
— ANI (@ANI) May 28, 2023
-
భవన నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను సత్కరించిన ప్రధాని మోదీ
ప్రారంభోత్సవానికి ముందు పార్లమెంటు భవనాన్ని నిర్మించిన కార్మికులను అభినందించి.. సత్కరించారు ప్రధాని మోదీ.
#WATCH | PM Narendra Modi felicitates the workers who helped in the building and development of the new Parliament House. pic.twitter.com/r6TkOQp4PX
— ANI (@ANI) May 28, 2023
-
రాజదండం ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ..
పార్లమెంట్ భవనంలోని స్పీకర్ కుర్చీ వద్ద సెంగోల్‌ను ప్రతిష్ఠిచారు ప్రధాని మోదీ. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు ప్రధాని మోదీ.
-
సెంగోల్‌తో పార్లమెంట్‌లోకి ప్రధాని మోదీ
పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సెంగోల్‌ను ఏర్పాటు చేయగా, ఆయనతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు.
#WATCH दिल्ली: नए संसद भवन के उद्घाटन समारोह की शुरुआत हवन और पूजा से हुई। pic.twitter.com/ct749Or82P
— ANI_HindiNews (@AHindinews) May 28, 2023
-
సెంగోల్‌కు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం..
పార్లమెంట్ భవనంలోకి వెళ్లే ముందు ప్రధాని మోదీ సెంగోల్‌కు నమస్కరించారు.
-
ప్రధాని మోదీని ఆశీర్వదించిన 18 మఠాల మఠాధిపతులు
తమిళనాడు సెంగోల్‌ను ప్రధాని మోదీకి అందించారు. 18 మఠాల మఠాధిపతులు ఆయనను ఆశీర్వదించారు.
-
హవన పూజతో..
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం హవన, పూజలతో ప్రారంభమైంది.
#WATCH दिल्ली: नए संसद भवन के उद्घाटन समारोह की शुरुआत हवन और पूजा से हुई। pic.twitter.com/ct749Or82P
— ANI_HindiNews (@AHindinews) May 28, 2023
-
పూజలు ప్రారంభం, స్పీకర్ ఓం బిర్లా కలిసి ప్రధాని మోదీ..
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ప్రారంభమైంది. నినాదాల మధ్య దేశ నూతన పార్లమెంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు. ఆయనతో పాటు స్పీకర్ ఓం బిర్లా కూర్చున్నారు.
-
8:45 గంటలకు ప్రధాని మోదీ చేతుల మీదుగా..
ఈరోజు ఉదయం 8:45 గంటలకు కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
లైవ్ ఇక్కడ చూడండి
-
నూతన పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రులు
పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నూతన పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. వీరిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హేమంత్ విశ్వశర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితోపాటు ఇతర ముఖ్యమంత్రులు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌కు చేరుకుంటున్నారు.
-
పార్లమెంట్ భవనానికి చేరుకున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా ప్రారంభోత్సవ వేడుకల సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని కొత్త పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు
-
పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం
పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ప్రజారాజ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ఒకప్పుడు రాహుల్ గాంధీ ఆర్డినెన్స్‌ను తుంగలో తొక్కి ప్రజారాజ్యాన్ని నిర్వీర్యం చేశారన్నారు.
-
పార్లమెంటు భవనానికి బయలుదేరిన తమిళనాడుకు చెందిన మఠాధిపతులు
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం కోసం తమిళనాడులోని వివిధ మఠాధిపతులు కొత్త పార్లమెంట్ భవనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన వెల్లకురుచ్చి 18వ పూజారి ఆదినం మాట్లాడుతూ.. ఈరోజు నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్నందున భారతదేశానికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. స్పీకర్ కుర్చీ దగ్గర సెంగోల్‌ను ఏర్పాటు చేస్తారు.
-
వేడుకలో 25 పార్టీలు , 19 పార్టీల బహిష్కరణ
దేశంలోని మొత్తం 25 రాజకీయ పార్టీలు కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటుండగా, కాంగ్రెస్‌తో సహా 19 రాజకీయ పార్టీలు వేడుకను బహిష్కరించాయి.
-
పార్లమెంట్ ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇదే..
నేడు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం. ఉదయం 7:30 గంటలకు పూజా కార్యక్రమాలు. ఉదయం 8:30కు పార్లమెంట్ చాంబర్లకురానున్న ప్రధాని మోదీ. ఉ.9 గంటలకు పార్లమెంట్ లాబీల్లో సర్వమత ప్రార్థనలు. మ.12 గంటలకు వేదికపైకి రానున్న ప్రధాని మోదీ. మధ్యాహ్నం 12:07 గంటలకు జాతీయ గీతాలాపన. మ.12:10 గంటలకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రసంగం. మధ్యాహ్నం12:29కు ఉపరాష్ట్రపతి సందేశం. మధ్యాహ్నం 12:30 గంటలకు రాష్ట్రపతి సందేశం. మధ్యాహ్నం 12:38కు ప్రతిపక్ష నేతల ప్రసంగం.మధ్యాహ్నం 12:43 గంటలకు లోక్‌సభ స్పీకర్ ప్రసంగం.మధ్యాహ్నం ఒంటిగంటకు రూ.75 నాణెం, స్టాంప్ విడుదల. మధ్యాహ్నం 1:10 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం.
-
విశేషంగా ఆకర్షిస్తున్న పార్లమెంట్ న్యూ బిల్డింగ్ దృశ్యాలు..
మొత్తానికి చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్న పార్లమెంట్ న్యూ బిల్డింగ్ దృశ్యాలు, అత్యాధునిక రాజ్యాంగ హాల్, హై టెక్నాలజీతో రూపొందించిన ఇతర కార్యాలయాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి.
-
ఉభయ సభల్లో అత్యాధునిక సదుపాయాలు..
కొత్త పార్లమెంట్ భవనం డిజిటల్ పార్లమెంట్‌ను తలపిస్తోంది. ఉభయ సభల్లో అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. సభ్యుల సీట్లలో బయోమెట్రిక్ పరికరాలు, అనువాదం కోసం డిజిటల్ డివైజ్‌లు, మల్టీమీడియా డిస్‌ప్లేలు, మీడియా కోసం ప్రత్యేకంగా 530 సీట్లు ఏర్పాటు చేశారు.
-
నెమలి థీమ్‌తో లోక్‌సభ సీటింగ్..
65వేల చదరపు మీటర్ల బిల్ట్ ఏరియాతో ఉన్న ఈ భవనంలో లోక్‌సభ సీటింగ్‌ను నెమలి థీమ్‌తో తయారు చేశారు. పాత భవనంతో పోలిస్తే 3 రెట్లు అధికసీట్లు ఏర్పాటు చేశారు. లోక్‌సభలో సీట్ల సంఖ్య 888 ఉండగా, సంయుక్త సమావేశాల్లో 1272 మంది కూర్చునే వీలు ఉంది. ఇక రాజ్యసభ తామరపువ్వు థీమ్‌తో నిర్మించారు. 384 మంది ఎంపీలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. రెండు సభల్లోనే భారీ తెరలు ఏర్పాటు చేశారు.
-
రెండున్నర ఏళ్లలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి
డిసెంబర్ 2020లో పార్లమెంట్ భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రెండున్నర ఏళ్లలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తయ్యింది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్‌లో భాగమైన..ఈ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇందులో పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు కమిటీ గదులు కూడా ఎన్నో హంగులతో రూపుదిద్దుకున్నాయి. 150 ఏళ్ల వరకు నిలిచి ఉండేలా నిర్మాణం చేశారు. భూగర్భంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్యాలయాలని ఏర్పాటు చేశారు.
-
కొత్త పార్లమెంట్ భవనం ఎన్నో ఆకర్షణలు..
భారతీయులు ఎంతగానో ఎదురుచూస్తున్న కొత్త పార్లమెంట్ భవనం ఎన్నో ఆకర్షణలు.. మరెన్నో ప్రత్యేకతలకు నిలయం. సర్వాంగ సుందరంగా, అత్యాధునిక సదుపాయాలతో 16 ఎకరాల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారు. ఈ పార్లమెంట్ భవనానికి దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చయింది. దీని నిర్మాణంలో దాదాపు 6 వేల మంది కార్మికులు పాల్గొన్నారు. అతితీవ్ర భూకంపాలను సైతం తట్టుకునేలా లోక్‌సభ, రాజ్యసభ, రాజ్యాంగ హాలును పటిష్టంగా నిర్మించారు.
-
దేశ అభివృద్ధికి నిదర్శనంగా..
కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్.. దేశ అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఓ మహా కట్టడాన్ని నిర్మించడమే కాకుండా... అందులో అడుగడుగునా భారతీయత ఉట్టిపడేలా చేశారు. దేశ రాజధాని నడిబొడ్డున అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతిని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కొత్త పార్లమెంట్‌ని జాతికి అంకితం చేస్తున్నారు.
Published On - May 28,2023 6:46 AM