TV9 WITT Summit: మహిళా శక్తితో భారత్ ఎలా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.. స్మృతి ఇరానీ మాటల్లో..
TV9 నెట్‌వర్క్ మరోసారి తన వార్షిక ఈవెంట్ వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌ను తీసుకువచ్చింది. వాట్ ఇండియా థింక్స్ టుడే వంటి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో చర్చా గోష్టి నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న కార్యకలాపాలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. రాజకీయాలు, క్రీడలు, సినిమా, ఆర్థిక శాస్త్రంతో సహా ప్రతి ముఖ్యమైన అంశాన్ని చర్చించడానికి ఈ సదస్సు ప్రయత్నిస్తోంది.
TV9 నెట్‌వర్క్ మరోసారి తన వార్షిక ఈవెంట్ వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌ను తీసుకువచ్చింది. వాట్ ఇండియా థింక్స్ టుడే వంటి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో చర్చా గోష్టి నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న కార్యకలాపాలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. రాజకీయాలు, క్రీడలు, సినిమా, ఆర్థిక శాస్త్రంతో సహా ప్రతి ముఖ్యమైన అంశాన్ని చర్చించడానికి ఈ సదస్సు ప్రయత్నిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి రాజకీయ ప్రముఖులు సైతం ఈ వేదికను పంచుకోనున్నారు.
ఫిబ్రవరి 25న మొదలయ్యే వాట్ ఇండియా టుడే వంటి వేదికలలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొంటారు. ‘నారీ శక్తి ఎవాల్వ్డ్ ఇండియా’ సెషన్‌లో అభివృద్ధి చెందిన భారతదేశంలో మహిళా శక్తి, ప్రాముఖ్యతపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి ఇరానీ తన అభిప్రాయాలను తెలియజేస్తారు. మహిళాభివృద్ధిపై మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి ఆమె సమాచారం ఇవ్వనున్నారు.
రాబోయే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం ఎలాంటి పథకాలు చేపడుతుందో కూడా చెప్పనున్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతుందని, అనేక సంక్షేమ పథకాల ద్వారా మహిళల జీవన ప్రమాణాలను పెంచడంలో బిజీగా ఉందన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ‘విక్షిత్ భారత్’ విజన్‌ను సాధించేందుకు దేశ మహిళా శక్తి అతిపెద్ద హామీ అని ప్రధాని మోదీ ఇప్పటికే చెప్పారు.
దేశంలోని పేదలు, యువత, రైతులు, మహిళలను కూడిన 4 వర్గాలను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ముఖ్యమైనదిగా పరిగణిస్తుంది. ఈ 4 ముఖ్యమైన వర్గాల అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మోదీ ప్రభుత్వం విశ్వసిస్తోంది. తాజాగా మోదీ ప్రభుత్వం కోటి ‘లఖపతి దీదీ’ని 3 కోట్లకు పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం ‘లఖపతి దీదీ’ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇప్పుడు దేశంలోని ఒక కోటికి బదులుగా 3 కోట్ల ‘లఖపతి దీదీ’ని చేయడానికి దేశంలోని మహిళల నుండి మద్దతు కోరుతున్నారు.
ఫిబ్రవరి 20న జమ్మూ కాశ్మీర్‌లో తన పర్యటన సందర్భంగా మహిళా లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, “ఇలాంటి స్వయం సహాయక సంఘాలలో పనిచేసే మీలాంటి సోదరీమణులకు సాయం అందించి, అభివృద్ధి చేయడమే నా పెద్ద కల” అని అన్నారు. వారిలో నేను 3 కోట్ల మంది మహిళలను లఖపతి దీదీని చేయాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చార ప్రధాని నరేంద్ర మోదీ.
దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న టీవీ9 గ్లోబల్ సమ్మిట్‌లో అనేక అంశాలపై చర్చిస్తారు. అదే సమయంలో, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (PMAY-R), ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY), జల్ జీవన్ మిషన్, PM కిసాన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఆయుష్మాన్ భారత్, PM ఉజ్వల, ప్రధాన మంత్రి కిసాన్ ఎనర్జీ సెక్యూరిటీ వంటి అనేక కేంద్ర పథకాలను తీసుకువచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ.
TV9 నెట్‌వర్క్ తన గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడే రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తోంది. ఈ గ్రాండ్ ప్రోగ్రామ్ దేశ రాజకీయాలు, పాలన, వినోదం, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలతో సహా అనేక ముఖ్యమైన అంశాలపై లోతైన చర్చ జరుగనుంది. ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యే సమ్మిట్ ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….