AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 WITT Summit: ఖేలో ఇండియా ద్వారా భారత్ ఎలా సూపర్ పవర్ అవుతుందో తెలుసా.. అనురాగ్ ఠాకూర్ మాటల్లో..!

మొదటి సీజన్ అద్భుతమైన విజయం తర్వాత, 'వాట్ ఇండియా థింక్స్ టుడే' మరోసారి అనేక మంది ముఖ్యమైన వ్యక్తులతో తిరిగి వచ్చింది. భారతదేశపు అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ TV9 ఈ ప్రత్యేక ఈవెంట్ వీక్షకులకు చర్చల ద్వారా సమాచారాన్ని అందించడానికి దాని రెండవ ఎడిషన్‌తో తిరిగి వస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

TV9 WITT Summit: ఖేలో ఇండియా ద్వారా భారత్ ఎలా సూపర్ పవర్ అవుతుందో తెలుసా.. అనురాగ్ ఠాకూర్ మాటల్లో..!
Anurag Thakur
Balaraju Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Feb 24, 2024 | 5:43 PM

Share

మొదటి సీజన్ అద్భుతమైన విజయం తర్వాత, ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ మరోసారి అనేక మంది ముఖ్యమైన వ్యక్తులతో తిరిగి వచ్చింది. భారతదేశపు అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ TV9 ఈ ప్రత్యేక ఈవెంట్ వీక్షకులకు చర్చల ద్వారా సమాచారాన్ని అందించడానికి దాని రెండవ ఎడిషన్‌తో తిరిగి వస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, ప్రముఖ భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు ప్రముఖ ఆటగాళ్లు కూడా ఇందులో పాల్గొంటున్నారు.

గతంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా, ఆపై బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ కేంద్ర ప్రభుత్వంలో క్రీడా మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టి దేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి, ఆటల తీరు మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఖేలో ఇండియా గేమ్స్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కొత్త ప్రతిభను గుర్తించి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు వేదికను కల్పిస్తోంది.

దేశాన్ని స్పోర్ట్స్ సూపర్‌పవర్‌గా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ‘ఖేలో ఇండియా’ ప్రారంభించగా, అప్పటి నుంచి దేశంలోని యువత దాని ప్రయోజనాలను పొందుతున్నారు. భారత ప్రభుత్వం ఖేలో ఇండియా ద్వారా దేశంలోని యువతను ఎలా ప్రోత్సహిస్తోందో, ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రభుత్వ ప్రణాళిక గురించి సమాచారం ఇవ్వనున్నారు.

సుప్రసిద్ధ క్రీడాకారులు హాజరు

సూర్యకుమార్ యాదవ్: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన స్టైలిష్, డేంజరస్ బ్యాటింగ్‌తో టీ20 క్రికెట్‌లో ప్రత్యేక ముద్ర వేశారు. ఏడాదికి పైగా ఈ ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న అతను టీమిండియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. టీవీ 9 నిర్వహించే ఈవెంట్ పాల్గొంటున్నారు.

హర్మిలన్ బెయిన్స్: గతేడాది ఆసియా క్రీడల్లో 800 మీటర్ల రేసులో భారత యువ అథ్లెట్ హర్మిలన్ బెయిన్స్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఇది కాకుండా, 1500 మీటర్లలో భారతదేశ జాతీయ రికార్డును కూడా సాధించారు.

పుల్లెల గోపీచంద్: భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్, ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ భారతదేశానికి చాలా మంది పెద్ద బ్యాడ్మింటన్ ఆటగాళ్లను అందించారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి వారు ఆయన శిష్యులు. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు సాధించారు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో దేశానికి కొత్త బ్యాడ్మింటన్ స్టార్లను అందిస్తున్నారు.

అమీర్ హుస్సేన్: జమ్మూ కాశ్మీర్ పారా క్రికెట్ టీమ్ కెప్టెన్ అమీర్ హుస్సేన్ లోన్ తన విభిన్నమైన బ్యాటింగ్‌తో చర్చనీయాంశంగా ఉండటమే కాకుండా, ఆటగాళ్లను కూడా ఉత్తేజపరిచారు. మెడపై బ్యాట్ పట్టుకుని షాట్లు ఆడుతున్న వీడియో ఇటీవల వార్తల్లో నిలిచింది. వీరంతా టీవీ9 అధ్వర్యంలో నిర్వహించే ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ సమిట్‌లో పాల్గొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…