Ram Phir Laute Book Launch: ‘రాముడే మతం, రాముడే దేశం’.. హేమంత్ శర్మ ‘రామ్ ఫిర్ లౌటే’ పుస్తకావిష్కరణలో ప్రముఖులు
అయోధ్య, రామాలయం ఉద్యమానికి సంబంధించి ప్రముఖ రచయిత, టీవీ9 నెట్‌వర్క్ న్యూస్ డైరెక్టర్ హేమంత్ శర్మ రాసిన 'రామ్ ఫిర్ లౌట్' పుస్తకావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ప్రభాత్ ప్రకాశన్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కి చెందిన సర్కార్యవా దత్తాత్రేయ హోసబాలే శనివారం (డిసెంబర్ 9) ఆవిష్కరించారు
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవానికి ముందు రాముడు, అయోధ్య, రామాలయం ఉద్యమానికి సంబంధించి ప్రముఖ రచయిత, టీవీ9 నెట్‌వర్క్ న్యూస్ డైరెక్టర్ హేమంత్ శర్మ రాసిన ‘రామ్ ఫిర్ లౌట్’ పుస్తకావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ప్రభాత్ ప్రకాశన్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కి చెందిన సర్కార్యవా దత్తాత్రేయ హోసబాలే శనివారం (డిసెంబర్ 9) ఆవిష్కరించారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో వేదికగా స్వామి శ్రీ జ్ఞానానంద మహారాజ్ సమక్షంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ అధ్యక్షత వహించారు. 200 రూపాయల ధర కలిగిన ఈ పుస్తకాన్ని ప్రభాత్ ప్రకాశన్ ప్రచురించింది. జర్నలిజం రంగంలో హేమంత్ శర్మకు 35 ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 గ్రూప్ న్యూస్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన రచనలకు గుర్తింపుగా యశ్ భారతి అవార్డుతో సహా పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు హేమంత్ శర్మ. ‘రామ్ ఫిర్ లౌట్’ పుస్తకానికి ముందు ‘యుధ్ మే అయోధ్య’ ‘అయోధ్య కా చష్మ్‌దీద్’ సహా పలు పుస్తకాలను రచించారు హేమంత్ శర్మ.
500 ఏళ్ల నిరీక్షణకు తెర..
రామ్ ఫిర్ లౌట్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌కుమార్ మాట్లాడుతూ’ 500 ఏళ్ల నిరీక్షణ, 20 నుంచి 25 తరాల పోరాటం తర్వాత ఎట్టకేలకు అయోధ్యలో రామాలయం ప్రతిష్ఠాపన జరగనుంది. జనవరి 22న, దేశంలోని వేలాది మంది సాధువులు, ప్రముఖుల సమక్షంలో రాముడి విగ్రహాన్ని ఆయన జన్మస్థలంలో నిర్మించిన గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. రాముడిని తన ఇంటి గుడిలో కూర్చోబెడుతున్నారని, ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రత్యక్షంగా వీక్షించాలి’ అని కోరారు. పుస్తకావిష్కరణ అనంతరం స్వామి జ్ఞాన్ ఆనంద్‌జీ మహరాజ్ ప్రసంగిస్తూ ‘రాముడు మా విశ్వాసం, ఆయన నిశ్చయత అని అన్నారు. ‘రాముడు మన సంప్రదాయం. రాముడు మనకు గుర్తింపు. రాముడు మన ఆత్మగౌరవం. రాముడు మనకు గుర్తింపు. రాముడు మన శరీరం, మనస్సులో, ప్రతి భాగంలో ఉన్నాడు’ అని పేర్కొన్నారు.
రాముడే మతం, రాముడే దేశం..
ఇక సంఘ్ సర్కార్ నాయకుడు దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ ‘అయోధ్యపై హేమంత్ శర్మ ఇప్పటికే 2 పుస్తకాలు రాశారు. ఇది ఆయనిది మూడవ పుస్తకం. హేమంత్ జీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వందేభారత్ వేగంతో ఈ పుస్తకాన్ని రాశాను అని నాతో చెప్పారు. రాముడే మతం. రాముడు దేశం. రాముడు ఉన్నచోట అడవులు, మనుషులు కూడా ఉంటారు. రాముడు లేని చోట మనుషులు కూడా అడవులే. జీవితంలో ఉత్తమమైనది ఎక్కడ ఉంటుందో అక్కడ రాముడు ఉంటాడు. రామమందిరం కేవలం పర్యాటకం కోసం నిర్మించిన దేవాలయం కాదు. అయోధ్య అంటే ప్రజాస్వామ్యం’ అని చెప్పుకొచ్చారు.