రాముడి ప్రాణప్రతిష్టకు ముస్తాబవుతున్న అయోధ్య.. రామ్‌లల్లా కొలువుదీరే గర్భగుడి ఫోటోలు విడుదల
దేవతలు నిర్మించిన పవిత్ర నగరం. సాక్షాత్తు రాముడు నడిచిన పవిత్ర నేల. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఎట్టకేలకు దశాబ్దాల నాటి హిందువుల కల నెరవేరబోతోంది. భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రామ్‌లల్లా కొలువుదీరే గర్భగుడి ఫోటోలను ఆలయ ట్రస్టు విడుదల చేసింది. ఇక్కడే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. జనవరి 22న జరిగే ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్దయెత్తున నిర్వహించాలని సంకల్పించింది.
వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు అయోధ్య నగరం ముస్తాబవుతోంది. విగ్రహాలను ప్రతిష్ఠించి రామ మందిరాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్మాణ కమిటీ నిర్ణయించింది. తాజాగా ఆలయ గర్భగుడి ఫోటోలను రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ట్విట్టర్‌లో ఫొటోలు పోస్ట్ చేశారు. రామ్‌లాలాను ప్రతిష్టించే చోటు ఈ ఫోటోల్లో కనబడుతోంది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవ వేడుక కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరిగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది.
प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx
— Champat Rai (@ChampatRaiVHP) December 9, 2023
అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి దేశంలోని 8వేల మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, RSS చీఫ్ మోహన్ భగవత్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రతన్‌టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సచిన్, విరాట్ కోహ్లి సహా ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఆహ్వానం అందుకున్న వారిలో పలువురు జర్నలిస్టులు, మాజీ ఆర్మీ అధికారులు, పద్మ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 మంది కరసేవకుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపించారు.
श्री राम जन्मभूमि मंदिर निर्माण कार्य – वर्तमान स्थिति
Shri Ram Janmabhoomi Mandir construction work – Current status pic.twitter.com/IdQ3krCDoB
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 8, 2023
జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్న నేపథ్యంలో 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. వారందరికీ శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్తులు పెద్దయెత్తున తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తంగా ఆ అయోధ్య రామయ్య సేవా భాగ్యాన్ని నోచుకునేందుకు భక్తి పారవశ్యంతో కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…