AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయ దౌత్యవేత్త రవీంద్ర మహాత్రే హత్య మిస్టరీ.. న్యూస్‌9లో ప్రత్యేక డాక్యుమెంటరీ

1984 ఫిబ్రవరి 3వ తేదీన బర్మింగ్‌హామ్‌లోని భారత కాన్సులేట్‌లో అసిస్టెంట్ కమీషనర్‌ రవీంద్ర మహత్రే కిడ్నాప్‌కు గురయ్యారు. కాశ్మీర్‌ లిబరేషన్‌ ఆర్మీ తామే కిడ్నాప్‌ చేసిననట్లు తెలిపింది. న్యూఢిల్లీలోని తీహార్‌ జైలులో బందీగా ఉన్న ఉగ్రవాది మక్బూల్ బట్‌తో పాటు అతని ఇద్దరి అనుచరులతో పాటు మరో ఏడుగురు ఉగ్రవాదులను విడిపించాలని, అలాగే ఒక మిలియన్‌ పౌండ్లను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే ఫిబ్రవరి...

భారతీయ దౌత్యవేత్త రవీంద్ర మహాత్రే హత్య మిస్టరీ.. న్యూస్‌9లో ప్రత్యేక డాక్యుమెంటరీ
Ravindra Mhatre
Narender Vaitla
|

Updated on: Dec 09, 2023 | 2:32 PM

Share

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లోని భారత దౌత్యవేత్తలకు గత కొన్ని నెలలుగా ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విదేశాల్లోని భారతీయ దౌత్యవేత్తలపై బెదిరింపు వాతావరణాన్ని ఖండించారు. ఇదిలా ఉంటే ఒకప్పటి భారతీయ దౌత్యవేత్త రవీంద్ర మహాత్రే హత్యకు సంబంధించి మిస్టరీని చేధించేందుకు న్యూస్‌9 రంగంలోకి దిగింది. లండన్‌లో 40 ఏళ్ల క్రితం జరిగిన ఈ హత్యకు సంబంధించి న్యూస్‌9 దర్యాప్తు చేసింది. 40 ఏళ్లుగా పరిష్కారం కానీ భారత దౌత్యవేత్త హత్యకు సంబంధించి న్యూస్‌9లో స్ట్రీమింగ్ అవుతోన్న డాక్యుమెంటరికీ సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

1984 ఫిబ్రవరి 3వ తేదీన బర్మింగ్‌హామ్‌లోని భారత కాన్సులేట్‌లో అసిస్టెంట్ కమీషనర్‌ రవీంద్ర మహత్రే కిడ్నాప్‌కు గురయ్యారు. కాశ్మీర్‌ లిబరేషన్‌ ఆర్మీ తామే కిడ్నాప్‌ చేసిననట్లు తెలిపింది. న్యూఢిల్లీలోని తీహార్‌ జైలులో బందీగా ఉన్న ఉగ్రవాది మక్బూల్ బట్‌తో పాటు అతని ఇద్దరి అనుచరులతో పాటు మరో ఏడుగురు ఉగ్రవాదులను విడిపించాలని, అలాగే ఒక మిలియన్‌ పౌండ్లను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే ఫిబ్రవరి 5వ తేదీన రవీంద్ర తలపై రెండు తుపాకీ గాయాలతో శవమై కనిపించారు. అనంతరం రంగంలోకి దిగిన యూకే పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే అసలు కుట్రదారులను మాత్రం అరెస్ట్ చేయలేదు.

40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ కేసును చేధించే దిశగా న్యూస్‌9 అడుగులు వేసింది. ఇందులో భాగంగా రవీంద్ర హంతకుడు ఉన్న స్థానాన్ని గుర్తించింది. ఈ విషయమై టీవీ9 నెట్‌వర్క్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌, నేషనల్‌ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ అఫైర్స్ ఆదిత్య రాజ్‌కౌల్ మాట్లాడుతూ.. రవీంద్రను హత్య చేసిన వ్యక్తిని పట్టుకోవడంలో యూకే ప్రభుత్వం విఫలమైంది. ఈ కారణంగానే మేము వారు చేయాల్సిన పనిని చేయాల్సి వచ్చింది. నెలల పాటు సాగిన దర్యాప్తులో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాం. 40 ఏళ్లుగా రహస్యంగా జీవిస్తున్న ఉగ్రవాది జాడను మేము కనుగొన్నాం. ఈ ఈరోజు సదరు వ్యక్తి రవీంద్ర హత్యకు తనను కారకుడినని చేస్తారన్న భయంలో ఉన్నాడు’ అని చెప్పుకొచ్చారు.

ఇక ఇదే విషయమై బ్రిటన్‌లోని భారత హైకమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామి మాట్లాడుతూ.. ‘భారతదౌత్యవేత్త రవీంద్ర మహాత్రేకు జరిగినది ఎవరికైనా జరగొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత దౌత్యవేత్తలకు ఇటీవలి కాలంలో బెదిరింపులు పెరుగుతున్నాయి. మన దౌత్యవేత్తలు ఆయా దేశాల్లో బెదిరింపులు ఎదుర్కొంటున్నారు’ అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఇంతకీ రవీంద్ర మహత్రే హత్య ఎలా జరిగింది.? అసలు దీనికి వెనకాల ఉన్న అసలు కుట్రదారులు ఎవరు.? అలాగే భారతీయ అధికారులపై ఇతర హత్యా కుట్రలకు సంబంధించిన దిగ్భ్రాంతిని కలిగించే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకోడానికి ‘మర్డర్‌ ఆఫ్‌ యాన్‌ ఇండియన్‌ డిప్లొమేట్‌. రవీంద్ర మహాత్రాస్‌ కిల్లర్‌ అన్‌మాస్క్‌డ్‌’ డాక్యుమెంటరీ చూడండి. డాక్యూమెంటరీకి సంబంధించిన ఎపిసోడ్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ప్రపంచంలోనే తొలి న్యూస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ న్యూస్9 యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.. 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..