AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Poll Result: ఉత్తరాదిన బీజేపీ ప్రభంజనం.. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు షాక్‌.. మధ్యప్రదేశ్‌లో కమలవికాసం..

Rajasthan, Madhya Pradesh and Chhattisgarh Election Results: ఉత్తర భారతం మరోసారి కాషాయం రంగు పులుముకోబోతుంది. మూడు రాష్ట్రాల్లో తన కమలం జెండాను ఎగురవేసేందుకు సిద్దమైంది బీజేపీ. ఇప్పటి వరకూ పోలైన ఓట్లు, ఆధిక్యంలో ఉన్న సీట్ల ప్రకారం బీజేపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రతి రాష్ట్రాలో తనదైన ముద్ర వేస్తూ గెలుపు దిశగా దూసుకుపోతోంది. మన్నటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం ట్రెండ్స్ కనిపిస్తున్నాయి.

Assembly Poll Result: ఉత్తరాదిన బీజేపీ ప్రభంజనం.. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు షాక్‌.. మధ్యప్రదేశ్‌లో కమలవికాసం..
Rajasthan, Madhya Pradesh And Chhattisgarh Assembly Elections Bjp Is Heading Towards Victory In All Three States
Srikar T
|

Updated on: Dec 03, 2023 | 1:05 PM

Share

ఉత్తర భారతం మరోసారి కాషాయం రంగు పులుముకోబోతుంది. మూడు రాష్ట్రాల్లో తన కమలం జెండాను ఎగురవేసేందుకు సిద్దమైంది బీజేపీ. ఇప్పటి వరకూ పోలైన ఓట్లు, ఆధిక్యంలో ఉన్న సీట్ల ప్రకారం బీజేపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రతి రాష్ట్రాలో తనదైన ముద్ర వేస్తూ గెలుపు దిశగా దూసుకుపోతోంది. మన్నటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయి కచ్చితమైన ఫలితం మరి కొన్ని గంటల్లో వెలువడనుంది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య కొనసాగుతున్న ఆధిక్యంలోని తేడాలను ఇప్పుడ గమనిద్దాం.

మధ్యప్రదేశ్..

గతంలో బీజేపీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ మరోసారి స్పష్టమైన మెజారిటీ స్థానాలతో అధికారంలోకి వచ్చే విధంగా ఆధిక్యం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 116 స్థానాలు గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సగమం అవుతుంది. కానీ బీజేపీ 158 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే.. కాంగ్రెస్ 70, ఇతరులు 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. దీనిని బట్టి బీజేపీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు అధికంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు సాధించగా.. బీజేపీ 109 కే పరిమితం అయింది. స్వల్ప సీట్ల తేడాతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయినప్పటికీ కొన్ని రాజకీయ సమీకరణాల ద్వారా అధికారాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. ఈసారి ఇలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. మధ్యప్రదేశ్ ఓటర్లు బీజేపీకి క్లియర్‌గా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ జోరు ఇలాగే కొనసాగుతుందా.. లేక ఆధిక్యం తగ్గే అవకాశం ఉందా అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాలి.

ఛత్తీస్‌గఢ్..

గతంలో కాంగ్రెస్ ఇక్కడ స్పష్టమైన మెజార్టీతో అధికారంలో ఉంది. ఛత్తీస్‌గ‌ఢ్‌లో మొత్తం 90 శాశన సభ స్థానాలకు గానూ బీజేపీ 60 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 29, ఇతరులు 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. సాధారణంగా 46 స్థానాలు గెలుచుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. దీనిని బట్టి ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 71, బీజేపీ 14, సీట్లను గెలుచుకున్నాయి. ఇతరులు కూడా కొన్ని చోట్ల గెలుపొందారు. అయితే నిన్న మొన్నటి వరకూ విడుదలైన ఎగ్జిట్ పోల్స్ మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ ఆ అంచనాలు ఇప్పుడు తారుమారు అయ్యాయి. బీజేపీ కమలం పరిమళాన్ని వెదజల్లుతూ కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. అయితే స్పష్టమైన ఫలితం వెలువడాలంటే మరి కొంత సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి

రాజస్తాన్..

గతంలో కాంగ్రెస్ ఇక్కడ కచ్చితమైన సీట్ల మెజార్టీతో అధికారంలో ఉండేది. రాజస్తాన్‌లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ ఇప్పటి వరకూ 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 75, ఇతరులు 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. సాధారణంగా అధికారం చేపట్టాలంటే 101 శాశనసభ స్థానాలను గెలవాల్సి ఉంటుంది. కానీ బీజేపీ అవసరమైన స్థానాల కంటే కూడా 8 స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతోంది. సాయంత్రం వరకూ ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ కంటే తగ్గితే ఇతరుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా బీజేపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందికరపరిస్థితులు తలెత్తకుంటే సొంతంగా గెలుపొందిన స్థానాలతోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 107, బీజేపీ 70 స్థానాలు గెలుచుకున్నాయి. ఇతరులు కూడా తీవ్ర ప్రభావం చూపారు. అయితే ఈసారి బీజేపీవైపు రాజస్తాన్ ఓటర్లు మొగ్గు చూపినట్లు ప్రస్తుతం ఉన్న ఆధిక్యం బట్టి అర్థమవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి