Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw: ‘మధ్యప్రదేశ్ మనసులో మోదీ.. మోదీ మదిలో మధ్యప్రదేశ్’.. బీజేపీ గెలుపుపై అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలుపు ఖాయం అంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ అధికారంలోకి రావాలంటే 116 అసెంబ్లీ స్థానాలు అవసరమని కానీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి భారీ మెజార్టీతో గెలవబోతున్నామని అన్నారు. ప్రజలు బీజేపీ తరఫున మద్దతుగా నిలిచారన్నారు.

Ashwini Vaishnaw: 'మధ్యప్రదేశ్ మనసులో మోదీ.. మోదీ మదిలో మధ్యప్రదేశ్'.. బీజేపీ గెలుపుపై అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు
Ashwini Vaishnaw After Bjp's Big Victory In Mp Elections Says Pm Modi Was Confident About It
Follow us
Srikar T

|

Updated on: Dec 03, 2023 | 1:44 PM

మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలుపు ఖాయం అంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ అధికారంలోకి రావాలంటే 116 అసెంబ్లీ స్థానాలు అవసరమని కానీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి భారీ మెజార్టీతో గెలవబోతున్నామని అన్నారు. ప్రజలు బీజేపీ తరఫున మద్దతుగా నిలిచారన్నారు.

ప్రస్తుతం 230 స్థానాలకు గానూ 160 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నామన్నారు. ‘మధ్యప్రదేశ్ ప్రజల మదిలో ప్రధాని మోదీ ఉన్నారని చెబుతూనే.. మోదీ మదిలో మధ్యప్రదేశ్‌కు సముచిత స్థానం కల్పించారన్నారు’. ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో గెలుపుపై అశ్వినీ వైష్ణవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో వచ్చిన ఆధిక్యంపై నరేంద్ర మోదీ దేవుడికి నమస్కరిస్తున్న ఫోటోకు ఒక సందేశాన్ని జోడిస్తూ ట్వీట్ చేశారు. ‘ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గ్యారెంటీలతో భారతదేశం వికసిస్తోంది’ అని తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు గానూ 160 స్థానాల్లో బీజేపీ, 69 చోట్ల కాంగ్రెస్, ఇద్దరు ఇతరులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. గతంలో బీజేపీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ మరోసారి స్పష్టమైన మెజారిటీ స్థానాలతో అధికారంలోకి వచ్చే విధంగా ఆధిక్యం కొనసాగుతోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు సాధించగా.. బీజేపీ 109 కే పరిమితం అయింది. స్వల్ప సీట్ల తేడాతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయినప్పటికీ కొన్ని రాజకీయ సమీకరణాల ద్వారా అధికారాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. ఈసారి ఇలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. మధ్యప్రదేశ్ ఓటర్లు బీజేపీకి క్లియర్‌గా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..