Congress Vs BJP: రెండు రాష్ట్రాలలో బీజేపీ, కాంగ్రెస్‌కి పోలైన ఓట్లెన్ని.. తక్కువ తేడాతో ఎక్కువ సీట్లు ఎలా సాధ్యం..
Rajasthan, Madhya Pradesh Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు ఎన్నికల అధికారులు. ప్రారంభంలో కాంగ్రెస్ కొంత ఆధిక్యంలో కనిపించినప్పటికీ ఆ తరువాత బీజేపీ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది. ప్రతి రౌండులో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది బీజేపీ. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 161 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు ఎన్నికల అధికారులు. ప్రారంభంలో కాంగ్రెస్ కొంత ఆధిక్యంలో కనిపించినప్పటికీ ఆ తరువాత బీజేపీ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది. ప్రతి రౌండులో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది బీజేపీ. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 161 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 66 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. 116 అసెంబ్లీ స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. అయితే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి దూసుకుపోతోంది కమలం పార్టీ. 100 శాతం ఓట్ షేర్‌లో బీజేపీ 49 శాతం ఓటింగ్ పర్సెంటేజ్ రాబట్టగలిగింది. కాంగ్రెస్ 40 శాతం, ఇతరులు 11 శాతం ఓట్ షేర్‌ను పొందారు. గతంలో కంటే అధికంగా ఓట్లను తనవైపుకు లాక్కోగలిగింది బీజేపీ. కాంగ్రెస్ పాత ఓటు బ్యాంకు బీజేపీ ఖాతాలో పడింది. దీంతో భారీ సీట్లను కైవసం చేసుకొని ఆధిక్యంలో కొనసాగుతోంది.
రాజస్తాన్‌లోనూ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది బీజేపీ. మొత్తం 199 అసెంబ్లీ స్థానాలకు గానూ ప్రస్తుతం 110 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ 73 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యానికి పరిమితం అయింది. ఇతరులు 16 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 101 రావాలి. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైనన్ని స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది కమలం పార్టీ. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పిన విషయం మనకు తెలిసిందే.
ఇక రాజస్తాన్‌లో పార్టీల వారీగా ఒక్కొక్కరు ఒక్కోరకమైన ఓట్ షేర్‌ను పొందగలిగారు. గతంలో కాంగ్రెస్ ఇక్కడ 107 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా ఈ స్థానాలకు మించి బీజేపీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. మొత్తం 100 శాతం ఓట్లలో ఇప్పటి వరకూ బీజేపీకి 42శాతం ఓట్ షేర్ రాబట్టగలిగింది. కాంగ్రెస్ 39, ఇతరులు 19 శాతం ఓట్ షేర్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌లకు మధ్య కేవలం 3శాతం ఓట్ షేర్ తగ్గినప్పటికీ.. 35కు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే బీజేపీ అభ్యర్థులు స్వల్ప ఆధిక్యంలోనే కొనసాగుతున్నారని చెప్పాలి. సగటున ఒక్క శాతం ఓట్ షేర్ పది అసెంబ్లీ స్థానాలపై ప్రభావం చూపుతోందని అర్థమవుతోంది. ఇక్కడ ఇతరులు కాంగ్రెస్ గెలుపుకు తీవ్ర ప్రభావం చూపుతున్నారు. 19శాతం ఓటింగ్ ఇతరులకు వెళ్లినప్పటికీ కేవలం 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో దిగడమే కాంగ్రెస్ ఆధిక్యం తగ్గడానికి కారణంగా చెప్పవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..