AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: షాకింగ్ ఘటన.. రోడ్డుపై వెంటాడి.. వేటాడి అమానుష దాడి! చోద్యం చేస్తున్నారే గానీ.. వీడియో వైరల్

పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. అనంతరం కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పెద్ద ఎత్తున బాటసారులు, పిల్లలు గుమికూడా చోద్యం చూడసాగారు. ఎవ్వరూ కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు వెంబడిస్తారు. దీంతో బాధిత వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఓ ఇంటి గోడవద్ద పడిపోతాడు. దీంతో తొలుత వచ్చిన వ్యక్తి రోడ్డుపై..

Viral Video: షాకింగ్ ఘటన.. రోడ్డుపై వెంటాడి.. వేటాడి అమానుష దాడి! చోద్యం చేస్తున్నారే గానీ.. వీడియో వైరల్
Delhi Man Beaten Man With Stones
Srilakshmi C
|

Updated on: Dec 03, 2023 | 12:03 PM

Share

ఢిల్లీ, డిసెంబర్‌ 3: పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. అనంతరం కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పెద్ద ఎత్తున బాటసారులు, పిల్లలు గుమికూడా చోద్యం చూడసాగారు. ఎవ్వరూ కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు వెంబడిస్తారు. దీంతో బాధిత వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఓ ఇంటి గోడవద్ద పడిపోతాడు. దీంతో తొలుత వచ్చిన వ్యక్తి రోడ్డుపై ఉన్న రాళ్లు, టైల్స్‌తో కొట్టడం ప్రారంభిస్తాడు.

ఆ వెనుకే కత్తి పట్టుకొచ్చిన మరో వ్యక్తి బాధిత యువకుడిపై దాడి చేస్తాడు. ఆనక ఇద్దరు వ్యక్తులు కలిసి బాధితున్ని విచక్షణా రహితంగా కొడుతూ, రాళ్లతో, కత్తితో దాడి చేయడం వీడియోలో కనిపిస్తుంది. దీంతో పాఠశాల విద్యార్ధులు, చుట్టు పక్కల వాళ్లు పెద్ద ఎత్తున గుమికూడి చోద్యం చూడసాగారే గానీ ఎవరు ఆపేప్రయత్నం చేయలేదు. ఇంతలో ఆ ఇంటి నుంచి ఓ మహిళ బయటికి వచ్చి ఏదో చెప్పడంతో వాళ్లు కొట్టడం మానివేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బాధిత యువకుడు కూడా లేచి వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆసుపత్రిలో బాధితుడు

ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరు జహంగీర్‌పురి ప్రాంతానికి చెందిన వారని, బాధితుడితో వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. దీనిపై ఆదర్శ్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యుఎ) అధ్యక్షుడు మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజీని చూసిన వెంటనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)కి సమాచారం అందించామన్నాడు.

నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌ఓ హామీ ఇచ్చారన్నారు. తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని, అందువల్లనే ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాధితుడి కుటుంబం నుంచి ఫిర్యాదు అందితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జితేంద్ర మీనా తెలిపారు. బాధితుడిపై దాడి చేసిన వ్యక్తులు నేర ప్రవృత్తి ఉన్న వారనీ, అందుకే బాటసారులు భయపడి బాధితుడికి సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.