‘కుతుబ్ మినార్’.. ఒక వేదశాల! ఈ విషయం చెప్పింది ఎవరో తెలుసా?
భారత పురావాస్తు సర్వే మాజీ రీజినల్ డైరెక్టర్ ధరమ్ వీర్ శర్మ.. ఢిల్లీలోని చారిత్రక కట్టడం కుతుబ్ మినార్ నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కుతుబ్ మినార్.. ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసేందుకు నిర్మించిన ఒక అబ్జర్వేటరీ అని ఆయన పేర్కొన్నారు. కుతుబ్ మినార్ ఒక వేదశాల అని తెలిపిన ఆయన.. ఇందుకు తగిన ఆధారాలు, కారణాలు కూడా ఉన్నాయని చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీలోని కుతుబ్ మినార్ ఎప్పుడూ వార్తల్లో ఉండే ఒక చారిత్రక కట్టడం. దీనిపై చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు అనేక వాదనలు వినిపిస్తుంటారు. కొందరు హిందూ సంఘాల నాయకులు.. అదొక హిందూ నిర్మాణమని, దాని పేరు విష్ణు స్తంభం అని చెబుతుంటారు. తాజాగా, భారత పురావాస్తు సర్వే మాజీ రీజినల్ డైరెక్టర్ ధరమ్ వీర్ శర్మ.. కుతుబ్ మినార్ నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కుతుబ్ మినార్.. ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసేందుకు నిర్మించిన ఒక అబ్జర్వేటరీ అని ఆయన పేర్కొన్నారు.
కుతుబ్ మినార్ ఒక వేదశాల!
ఢిల్లీలో జరుగుతున్న శబ్దోత్సవ్-2026 కార్యక్రమంలో ధరమ్ వీర్ శర్మ పాల్గొని ప్రసంగించారు. కుతుబ్ మినార్ ఒక వేదశాల అని తెలిపిన ఆయన.. ఇందుకు తగిన ఆధారాలు, కారణాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఒక స్మారక చిహ్నం, ఆలయం లేదా భవనం నిర్మించినప్పుడు ఒక ప్రణాళిక, ఉద్దేశం ఉంటుందన్నారు. ఇది వృత్తాకర నిర్మాణం కాబట్టి.. సహజం దీని పునాది కూడా వృత్తాకారంగానే ఉండాలని అన్నారు. కానీ, కుతుబ్ మినార్ పునాది మాత్రం దీర్ఘ చతురస్త్రాకారంగా ఉంటుందని శర్మ వివరించారు.
ఈ చారిత్రక కట్టడంపై రెండేళ్లు పరిశోధనలు చేశామన్న ధరమ్ వీర్ శర్మ.. నిర్మాణానికి సంబంధించిన అనేక కొత్త విషయాలు గుర్తించామని తెలిపారు. అవి డాక్యుమెంట్ రూపంలో లేవన్నారు. భవనం నిర్మాణం వెనుక కూడా శాస్త్రీయత దాగివుందని తెలిపారు. సంత్సరంలో లాంగెస్ట్ డే జూన్ 21న సూర్యుడు దక్షిణాయనంలోకి వచ్చాడని, కుతుబ్ మినార్ నీడ అరగంటపాటు నేతలపై పడలేదని శర్మ తెలిపారు. ఇవన్నీ ఈ కుతుబ్ మినార్ ఒక వేదశాల ని చెప్పడానికి రుజువులని వివరించారు. భారత్‌పై దాడులకు పాల్పడిన విదేశీ పాలకులు దీనిని నాశనం చేశారని అన్నారు. ఆ తర్వాత దీనిని తమకు అనుకూలంగా కుతుబ్ మినార్‌గా మార్చుకున్నారని ధరమ్ శర్మ వివరించారు.
