ఎముకల బలానికి ఆరోగ్యం కోసం తప్పకుండా పెరుగు తినాలని చెబుతుంటారు పెద్దలు. అయితే కొంత మంది పెరుగు తింటే మరికొందరు మజ్జిగ తాగుతుంటారు.
పెరుగు, మజ్జిగ
అయితే ఇప్పుడు మనం పెరుగు లేదా మజ్జిగ ఈ రెండింటి లో ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది. ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిదో వివరంగా తెలుసుకుందాం.
ఆరోగ్యం
జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారికి పెరుగు లేదా మజ్జిగ చాలా మేలు చేస్తుందని చెబుతుంటారు. ముఖ్యంగా ఎసిడిటీ ఉన్నవారు ఎక్కువగా పెరుగు తినడానికి ఇంట్రస్ట్ చూపుతుంటారు.
ఎసిడిటీ
అయితే అసలు ఎసిడిటీని తగ్గించడానికి పెరుగు లేదా మజ్జిగా ఇందులో ఏది ఎక్కువగా పని చేస్తుంది? దేని వలన ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే?
ఎసిడిటీ తగ్గడం
పెరుగులో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వలన ఇది ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇది పాలతో తయారు అవ్వడం వలన శరీరానికి చాలా మేలు చేస్తుంది.
కాల్షియం , ప్రోటీన్
పెరుగు తినడం వలన శరీరం చల్లబడటం, పేగు ఆరోగ్యం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కానీ ఇది తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కానివ్వదు.
జీర్ణ సమస్యలు
కానీ మజ్జిగ అనేది పెరుగుతో తయారు అవుతుంది. అందువలన దీనికి జీర్ణం చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉండటం వలన ఎసిడిటీ సమస్యలు ఉన్నవారికి ఆరోగ్యానికి ఇది చాలా మంచిది.