ఇంట్లో అయ్యప్ప ఫొటో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏం చేయాలంటే?

Samatha

3 January 2026

హిందూ మతంలో ఉన్న ప్రముఖ దేవుళ్లలో అయ్యప్ప స్వామి ఒకరు. చాలా మంది అయ్యప్ప స్వామికి దీక్షలు ఉంటూ, కొలుచుకుంటారు. అయితే సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప స్వామి మాల ధరించి, శబరిమలకు వెళ్తుంటారు.  

హిందూ మతం

అయితే కొంత మంది అయ్యప్ప స్వామి ఫొటోను ఇంటిలో పెట్టుకొని పూజిస్తుంటారు. మరి అయ్యప్ప స్వామి వారి ఫొటోను ఇంటిలో పెట్టుకొని పూజించడం మంచిదేనా? దీని గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

అయ్యప్ప స్వామి ఫొటో

పండితుల అభిప్రాయం ప్రకారం ఇంటిలో అయ్యప్ప స్వామి ఫొటో పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదంట. ముఖ్యంగా 18 మెట్లతో కూర్చొన్న ఫొటో ఉండటం శుభప్రదం.

పండితుల అభిప్రాయం

అయితే అయ్యప్ప స్వామి వారి ఫొటో ఇంటిలో పెట్టుకునే వారు తప్పకుండా, ఇంటిలోపల మాత్రమే స్వామి వారి ఫొటోను పెట్టుకోవాలంట, సింహ ద్వారం వెలుపల ఉంచడం మంచిది కాదు.

ఇంటిలోపల

అలాగే ఇంటిలో అయ్యప్ప స్వామి ఫొటో ఉంటే తప్పకుండా స్వామి వారికి రోజుకు మూడు సార్లు హారతి ఇవ్వాలంట. ఎందుకంటే? స్వామి వారికి హారతి అంటే చాలా ఇష్టం అంట.

హారతిని ఇవ్వడం

అలాగే,  ప్రతి రోజూ ప్రార్థనలు చేస్తూ, బెల్లంతో చేసిన తీపి నైవేద్యం సమర్పించాలంట. ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న వారికి శుభఫలితాలు కలుగుతాయి.

నైవేద్యం సమర్పించడం

అదే విధంగా ప్రతి రోజూ తప్పకుండా హరి హర సుతనే స్వామియే శరణం అయ్యప్ప అని లేదా స్వామియే శరణం అయ్యప్ప అనే నినాదాలు జపించడం మంచిది.

స్వామియే శరణం అయ్యప్ప

ఎవరి ఇంటిలోనైతే అయ్యప్ప స్వామి వారి ఫొటో ఉండి, నిత్యం పూజలు చేస్తారో, వారికి నవ గ్రహాల దోషాలు తొలిగిపోయి ఆనందంగా ఉంటారంట.

నవగ్రహ దోషం