Video Viral : పాక్ బౌలర్ కవ్వింపులకు విండీస్ వీరుడి గట్టి వార్నింగ్.. వీడియో వైరల్!
Video Viral : క్రికెట్ మైదానంలో బ్యాట్, బాల్ మధ్య పోరు సహజం. కానీ అప్పుడప్పుడు ఆటగాళ్ల మధ్య జరిగే మాటల యుద్ధం, కవ్వింతలు మ్యాచ్‌ను రక్తికట్టిస్తాయి. తాజాగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్ నాలుగో సీజన్ ఫైనల్‌లో వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్, పాకిస్థాన్ పేసర్ నసీమ్ షా మధ్య జరిగిన హైడ్రామా నెట్టింట వైరల్‌గా మారింది.

Video Viral : క్రికెట్ మైదానంలో బ్యాట్, బాల్ మధ్య పోరు సహజం. కానీ అప్పుడప్పుడు ఆటగాళ్ల మధ్య జరిగే మాటల యుద్ధం, కవ్వింతలు మ్యాచ్‌ను రక్తికట్టిస్తాయి. తాజాగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్ నాలుగో సీజన్ ఫైనల్‌లో వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్, పాకిస్థాన్ పేసర్ నసీమ్ షా మధ్య జరిగిన హైడ్రామా నెట్టింట వైరల్‌గా మారింది. మైదానంలో ఎంతటి మొనగాడైనా పొలార్డ్ ముందు వేషాలు వేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది.
దుబాయ్ వేదికగా ఆదివారం (జనవరి 4, 2026) జరిగిన ఎంఐ ఎమిరేట్స్, డెజర్ట్ వైపర్స్ ఫైనల్ పోరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంఐ కెప్టెన్ కీరన్ పొలార్డ్ క్రీజులో ఉన్నప్పుడు, నసీమ్ షా తన బౌలింగ్‌తో కవ్విస్తూ పదే పదే కళ్లు చూపిస్తూ రెచ్చగొట్టాడు. మామూలుగానే పొలార్డ్ కొంచెం గరం గరంగా ఉంటాడు. నసీమ్ చేష్టలకు ఒక్కసారిగా చిర్రెత్తిన పొలార్డ్, బ్యాట్ పట్టుకుని ముందుకు వచ్చి పాక్ బౌలర్‌కు వార్నింగ్ ఇచ్చాడు. పొలార్డ్ కళ్లు ఎర్రజేసి చూసేసరికి నసీమ్ షా ఒక్కసారిగా బిత్తరపోయాడు. మధ్యలో అంపైర్లు వచ్చి ఇద్దరినీ వారించడంతో గొడవ సద్దుమణిగింది.
Sparks fly in the middle! 🧨
The Final brings out many emotions, catching Naseem Shah & Kieron Pollard in the middle of it. ⚔️#Final #DVvMIE #DPWorldILT20 #WhereTheWorldPlays #AllInForCricket pic.twitter.com/PGUsSl3PaT
— International League T20 (@ILT20Official) January 4, 2026
పొలార్డ్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ, నసీమ్ షా తన బౌలింగ్ పదును మాత్రం తగ్గించలేదు. ఈ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇందులో పొలార్డ్ వికెట్ కూడా ఉండటం విశేషం. 28 బంతుల్లో 28 పరుగులు చేసిన పొలార్డ్‌ను నసీమ్ షా పెవిలియన్ పంపాడు. అంతిమంగా తన జట్టును విజేతగా నిలపడంలో నసీమ్ కీలక పాత్ర పోషించి, పొలార్డ్‌కు తన బంతితోనే సమాధానం చెప్పాడు.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్ జట్టు అదిరిపోయే ప్రదర్శన చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్.. కెప్టెన్ సామ్ కర్రన్ (74 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ తో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ ఎమిరేట్స్.. నసీమ్ షా ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 136 పరుగులకే కుప్పకూలింది. దీంతో డెజర్ట్ వైపర్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించి ఐఎల్ టీ20 నాలుగో సీజన్ ఛాంపియన్‌గా నిలిచింది. కవ్వింతలు, గొడవలు ఎలా ఉన్నా, క్రికెట్ పరంగా ఈ ఫైనల్ అభిమానులకు కావాల్సినంత మజాను అందించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
