AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill : ఇకపై వైట్‌వాష్‌లు ఉండవు..టెస్టుల్లో సర్జికల్ స్ట్రైకులే.. బీసీసీఐకి గిల్ షాకింగ్ డిమాండ్

Shubman Gill : భారత టెస్టు క్రికెట్‌లో గత కొంతకాలంగా ఎదురవుతున్న పరాజయాలకు అడ్డుకట్ట వేయాలని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నడుం బిగించారు. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 0-2తో వైట్‌వాష్‌కు గురైన తర్వాత, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకూడదని గిల్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.

Shubman Gill : ఇకపై వైట్‌వాష్‌లు ఉండవు..టెస్టుల్లో సర్జికల్ స్ట్రైకులే.. బీసీసీఐకి గిల్ షాకింగ్ డిమాండ్
Shubman Gill
Rakesh
|

Updated on: Jan 05, 2026 | 4:06 PM

Share

Shubman Gill : భారత టెస్టు క్రికెట్‌లో గత కొంతకాలంగా ఎదురవుతున్న పరాజయాలకు అడ్డుకట్ట వేయాలని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నడుం బిగించారు. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 0-2తో వైట్‌వాష్‌కు గురైన తర్వాత, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకూడదని గిల్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. దీని కోసం ఆయన ఏకంగా బీసీసీఐ ముందు ఒక భారీ డిమాండ్ ఉంచారు. గిల్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గత 13 నెలల కాలంలో టీమిండియా సొంతగడ్డపై రెండుసార్లు టెస్ట్ సిరీస్‌లలో ఘోరంగా ఓడిపోయింది. ముఖ్యంగా సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమి బీసీసీఐని ఆలోచనలో పడేసింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు, టీమ్ లీడర్‌షిప్ గ్రూప్‌తో బోర్డు నిర్వహించిన సమీక్షా సమావేశంలో శుభ్‌మన్ గిల్ తన మనసులోని మాటను బయటపెట్టారు. కేవలం నాలుగు రోజుల ముందు ప్రాక్టీస్ చేసి మైదానంలోకి దిగడం వల్ల ఫలితాలు రావడం లేదని, అందుకే ఇకపై ప్రతి టెస్ట్ సిరీస్‌కు ముందు కనీసం 15 రోజుల ట్రైనింగ్ క్యాంప్ ఉండాలని గిల్ డిమాండ్ చేశారు.

గతేడాది ఆసియా కప్ ముగిసిన కేవలం 4 రోజులకే టీమిండియా వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అలాగే దక్షిణాఫ్రికాతో సిరీస్ ముందు కూడా గిల్, ఇతర టెస్ట్ స్పెషలిస్ట్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 4 రోజులకే మ్యాచ్‌లోకి దిగారు. ఇలాంటి బిజీ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లకు రెడ్ బాల్ క్రికెట్‌కు అలవాటు పడే సమయం దొరకడం లేదని గిల్ వాదిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. గిల్ ప్లానింగ్ పట్ల బీసీసీఐ, సెలెక్టర్లు చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గిల్ విజన్, క్లారిటీ చూసి బోర్డు కూడా అతనికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.

భారత జట్టు బిజీ షెడ్యూల్ మధ్య 15 రోజుల క్యాంప్ నిర్వహించడం కత్తి మీద సామే. అయితే, దీని కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)ను వాడుకోవాలని బోర్డు భావిస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పరిమిత ఓవర్ల సిరీస్‌లలో బిజీగా ఉంటే, ఈ రెడ్ బాల్ క్యాంప్ బాధ్యతలను వివిఎస్ లక్ష్మణ్ కు అప్పగించే ఆలోచనలో కూడా బోర్డు ఉంది. గిల్ డిమాండ్ గనుక అమలైతే, భారత టెస్ట్ జట్టు మరింత పటిష్టంగా తయారవుతుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..