AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్.. ఇక నుంచి రూ.5 వేలు..? కేంద్రం గుడ్‌న్యూస్

దేశంలోని ఉద్యోగులందరికీ కేంద్రం సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఉద్యోగుల కనీస నెలవారీ పెన్షన్‌ను పెంచనుందని తెలుస్తోంది. ప్రస్తుతం రూ.వెయ్యిగా ఉండగా.. ఏకంగా దీనికి రూ.5 వేలకు పెంచనుందని సమాచారం. త్వరలో దీనిపై ఈపీఎఫ్‌వో నుంచి ప్రకటన రానుందని అంటున్నారు.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్.. ఇక నుంచి రూ.5 వేలు..? కేంద్రం గుడ్‌న్యూస్
Epfo 2
Venkatrao Lella
|

Updated on: Jan 05, 2026 | 11:19 AM

Share

ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులకు లబ్ది చేకూర్చేందుకు ఈపీఎఫ్‌లో ఎప్పటికప్పుడు నూతన మార్పులు అమలు చేస్తోంది. తాజాగా ఉద్యోగులకు మరింత బెనిఫిట్ జరిగేలా ఈపీఎఫ్‌వో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టేందుకు రెడీ అవుతోంది. పీఎఫ్ ఖాతాదారులకు ఉద్యోగుల పెన్షన్ పథకం(EPS)ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత నెలనెలా పెన్షన్ అందించడమే ఈ పథకం లక్ష్యం. పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతీ ఉద్యోగికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. తాజాగా ఈ స్కీమ్‌లో పలు మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

పెన్షన్ పెంపు

ప్రస్తుతం ఈపీఎఫ్‌ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత కనీస పెన్షన్ రూ.వెయ్యి చెల్లిస్తుంది. ఉద్యోగులకు ఆర్ధిక భద్రత కల్పించేందుకు దీనిని ఇప్పుడు రూ.5 వేలకు పెంచాలని కేంద్రం చూస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా కనీస పెన్షన్ లిమిట్ రూ.వెయ్యి మాత్రమే ఉంది. ద్రవ్యోల్బణం, ఖర్చులు పెరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు పెన్షన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. జీవన ప్రమాణాలు, ఖర్చులు పెరిగిన తరుణంలో పెన్షన్‌ను పెంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం పెంపుపై చర్చలు సాగుతున్నాయి. కనీస పెన్షన్‌ను రూ.వెయ్యి నుంచి రూ.5 వేలకు పెంచాలనేప్రతిపాదన ఉంది. ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ తమ ప్రాథమిక అవసరాలకు కూడా సరిపోవడం లేదని పెన్షన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ బెనిఫిట్

ఈపీఎఫ్‌వో ఖాతాదారులందరికీ ఎంప్లాయూస్ పెన్షన్ స్కీమ్ అమలవుతోంది. తమ ఉద్యోగ జీవితంలో కనీసం 10 సంవత్సరాలు ఈపీఎఫ్ చందా చెల్లించినవారికి 58 సంవత్సరాల తర్వాత నెలనెలా పెన్షన్ పొందవచ్చు. ప్రభుత్వం కనీస పెన్షన్ రూ.5 వేలకు పెంచితే ఉద్యోగులందరికీ లాభం జరగనుంది. ఇక ఇప్పటికే పదవీ విరమణ చేసినవారు, కనీస పెన్షన్ పొందుతున్న లక్షలాది మంది రిటైర్మెంట్ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.

భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
పండక్కి ఊరెళ్లేందుకు ట్రైన్‌ టిక్కెట్లు దొరకట్లేదా?
పండక్కి ఊరెళ్లేందుకు ట్రైన్‌ టిక్కెట్లు దొరకట్లేదా?
టీ లవర్స్‌కు గుడ్ న్యూస్! ఈ జపాన్ చాయ్ గురించి తెలుసా?
టీ లవర్స్‌కు గుడ్ న్యూస్! ఈ జపాన్ చాయ్ గురించి తెలుసా?