AP Govt Jobs 2026: ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ అర్హతలుంటే చాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆస్పత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆస్పత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. జనరల్ మెడిసిన్, రేడియాలజీ, గైనకాలజీ, అనస్థీషియా, జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, రేడియేషన్ థెరపీ, ఆప్తాల్మాలజీ, పీడియాట్రిక్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 8వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా..
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లినికల్) పోస్టుల సంఖ్య: 130
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (నాన్-క్లినికల్) పోస్టుల సంఖ్య: 16
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీ) పోస్టుల సంఖ్య: 74
- మొత్తం ఖాళీల సంఖ్య పోస్టుల సంఖ్య: 220
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌లో ఏదైనా ఒక డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వమోపరిమితి జులై 1, 2025 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడౠ్ల్యఎస్, అభ్యర్థులకు ఐదేళ్లు, పీడౠ్ల్యబీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జనవరి 22, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.2000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడౠ్ల్యఎస్, పీడౠ్ల్యబీ అభ్యర్ధులు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.68,900 నుంచి రూ.2,05,500 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంఎస్‌ఆర్‌బీ ఆంధ్రప్రదేశ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్న విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
