AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ నువ్వే ఫ్రెండువురా.. అండగా ఉండాల్సిన స్నేహితుడే అడ్వాంటేజ్ తీసుకున్నాడు.. చివరకు

భర్తతో విడాకులపై ఒంటరిగా ఉన్న స్నేహితురాలికి ధైర్యం చెప్పి అండగా ఉండాల్సిన ఒక యువకుడు.. ఆమె పాలిట యముడిలా మారాడు. తనను పెళ్లి చేసుకోవాలని వేధించడం స్టార్ట్ చేశాడు. తరచూ ఇంటికి వెళ్తూ ఒప్పుకోవాలని ఇబ్బంది పెట్టాడు. అందుకు ఆమె నిరాకరించండో.. కాపు కాచి మరీ కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన పక్కరాష్ట్రం కర్ణాటలో వెలుగు చూసింది.

ఛీ.. ఛీ నువ్వే ఫ్రెండువురా.. అండగా ఉండాల్సిన స్నేహితుడే అడ్వాంటేజ్ తీసుకున్నాడు.. చివరకు
Karnataka Murder Suicide
Anand T
|

Updated on: Jan 05, 2026 | 12:18 PM

Share

ఒంటరిగా జీవిస్తున్న స్నేహితురాలు తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని.. ఓ యువకుడు ఆమెను హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని యల్లాపురలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం.. రంజితా భాన్సోడే అనే యువతికి స్థానికంగా ఉన్న ఒక స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది. ఈమెకు 12 ఏళ్ల క్రితం వివాహం కాగా కుటుంబ కలహాల కారణంగా 5 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి.. ప్రస్తుతం ఒంటిరిగా జీవిస్తోంది. అయితే అదే ప్రాంతంలో నివసిస్తున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు రపీఫ్‌ ఇసామ్‌సాబ్‌కు ఈ విషయం తెలిసింది.

దీంతో రఫిక్ తరచూ ఆమెను కలిసేందుకు ప్రయత్నిస్తూ.. తనను పెళ్లి చేసేకోవాలని వేధించడం స్టార్ట్ చేశాడు. కొన్ని సార్లు నేరుగా ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి ఇబ్బందులకు గురిచేయడం కూడా చేశాడు. దీంతో విసిగిపోయిన రంజిత.. తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన రఫిక్ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. శనివారం పథకం ప్రకారం ఆమె స్కూల్‌ నుంచి ఇంటికి వస్తుండగా.. మార్గ మధ్యలో దారికాచి కత్తితో దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రంజిత అన్నా, వధినలు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.

అయితే ఆమె పరిస్థితి విషమించడంలో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హుబ్బళ్లిలోని కిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న రఫిక్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఇద్దరివి వ్యతిరేక మతాలు కావడంతో దీన్ని లవ్‌జిహాద్‌గా పరిగణించిన కొన్ని హిందూ సంఘాలు స్థానికంగా బంద్‌కు పిలుపునిచ్చారు.

అయితే మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమెదు చేసుకన్న పోలీసులు రఫిక్ ఆచూకీ కోసం గాలిస్తుండగా ఆదివారం ఉదయం యల్లాపురకు సమీపంలోని అటవీ ప్రాంతంలో అతని మృతదేహాం దొరికినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
పండక్కి ఊరెళ్లేందుకు ట్రైన్‌ టిక్కెట్లు దొరకట్లేదా?
పండక్కి ఊరెళ్లేందుకు ట్రైన్‌ టిక్కెట్లు దొరకట్లేదా?
టీ లవర్స్‌కు గుడ్ న్యూస్! ఈ జపాన్ చాయ్ గురించి తెలుసా?
టీ లవర్స్‌కు గుడ్ న్యూస్! ఈ జపాన్ చాయ్ గురించి తెలుసా?