పండక్కి ఊరెళ్లేందుకు ట్రైన్ టిక్కెట్లు దొరకట్లేదా? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకే!
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి నుండి విశాఖపట్నం మధ్య 2026 జనవరిలో (రైలు నంబర్లు 08513, 08514) నడవనున్న ఈ రైళ్లు రూట్లు, సమయాలు, బోగీల వివరాలు ఇలా ఉన్నాయి..

సంక్రాంతి పండక్కి చాలా మంది తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో సంక్రాంతిని ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండక్కి హైదరాబాద్ నగరం సగం ఖాళీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగులు చేసే వారు సంక్రాంతికి తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కిక్కిరిపోతాయి. నెలల ముందుగా ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకుంటే కానీ దొరకవు.
ఇప్పటికే దాదాపు చాలా వరకు టిక్కెట్లు బుక్ అయిపోయాయి. పండక్కి ఇటీవలె సెలవులు అధికారికంగా ప్రకటించడంతో మరికొంత మంది ఇప్పుడు టిక్కెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, చాలా ట్రైన్లకు టిక్కెట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. ఈ రద్దీని గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చర్లపల్లి నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వేస్ తాజాగా చర్లపల్లి – వైజాగ్ మధ్య ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..
- రైలు నంబర్ 08513 విశాఖపట్నం టు చర్లపల్లి 18.01.2026న ఆదివారం రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు చేరుకుంటుంది.
- రైలు నంబర్ 08514 చర్లపల్లి – విశాఖపట్నం 19.01.2026 సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది.
- ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రిలో ఆగుతాయి. ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లు ఇరువైపులా ఉన్నాయి.
- ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
