AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto News: ఈ కారు ధర కేవలం రూ.5.99 లక్షలే.. మైలేజీ 30 కి.మీ.. అమ్మకాల్లో రికార్డ్‌!

Auto News: దేశంలో మంచి మైలేజీ ఇచ్చే తక్కువ ధరల్లో అద్భుతమైన కార్లు ఉన్నాయి. అలాగే మారుతి సుజుకి నుంచి కూడా బెస్ట్ కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కారు ధర తక్కువ ఉండడమే కాకుండా లీటర్ ఇంధనంపై బెస్ట్ మైలేజీ ఇస్తుంది..

Auto News: ఈ కారు ధర కేవలం రూ.5.99 లక్షలే.. మైలేజీ 30 కి.మీ.. అమ్మకాల్లో రికార్డ్‌!
Maruti Suzuki Car
Subhash Goud
|

Updated on: Jan 05, 2026 | 3:23 PM

Share

Auto News: మార్కెట్లో రకరకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరల్లో మంచి మైలేజీ ఇచ్చే కార్లు ఎన్నో ఉన్నాయి. అయితే అందులో మారుతి సుజుకీ కార్లు ఉన్నాయి. మారుతి సుజుకి నుంచి వచ్చిన బలేనో కారుకు మంచి పేరుంది. గత ఏడాది 2025 డిసెంబర్‌లో ఈ కారు అమ్మకాలలో అగ్రస్థానంలో ఉంది. ఈ బలేనో కారు 2025 డిసెంబర్ నెలలో ఏకంగా 22,108 యూనిట్లను విక్రయించి దేశంలోనే నెంబర్ 1 కారుగా నిలిచిందని కంపెనీ వెల్లడించింది. అంతకుముందు అమ్మకాల్లో మారుతి ఫ్రాంక్స్ (20,700 యూనిట్లు), టాటా నెక్సాన్ (19,400 యూనిట్లు, మారుతి డిజైర్ వంటి కార్లను కూడా వెనక్కి నెట్టి ముందు వరుసలో దూసుకుపోయింది.గత ఐదు నెలలుగా నెలకు సగటున 13,776 కార్లు అమ్ముడవుతుండగా, డిసెంబర్ నాటికి ఆ సంఖ్య ఒక్కసారిగా పెరగడం ఆటోమొబైల్ రంగాన్ని విస్మయానికి గురిచేసింది.

ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. అయితే టాప్ ఎండ్ మోడల్ రూ.9.10 లక్షల లోపే లభిస్తుంది. అలాగే ఈ కారుపై దాదాపు రూ.86,000 వరకు ధర తగ్గడం ఈ కారుకు వరంగా మారింది.

మధ్య తరగతి ప్రజలకు అనుకూలం:

ఈ కారు మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ప్రజలు కారును కొనే ముందు దాని ధర, మైలేజీని గురించి తెలుసుకుంటారు. బలేనో పెట్రోల్ మోడల్ లీటరుకు 22.94 కి.మీ మైలేజీ ఇస్తుండగా, దీని సీఎన్‌జీ (CNG) వేరియంట్ ఏకంగా 30.61 కి.మీ మైలేజీని అందిస్తోంది. అంటే దాదాపు ఒక బైక్ ఇచ్చే మైలేజీతో కారులో హాయిగా ఫ్యామిలీతో ప్రయాణించవచ్చు. అయితే ఈ బలేనో కారు కేవలం మైలేజీ మాత్రమే కాదు, ఇందులో లగ్జరీ ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. 360-డిగ్రీ కెమెరా కూడా ఉంటుంది. ఇరుకైన సందుల్లో లేదా పార్కింగ్ చేసేటప్పుడు కారు చుట్టూ ఉన్న దృశ్యాలను స్క్రీన్ పై క్లియర్ గా చూడవచ్చు.

ఎయిర్‌ బ్యాగ్స్:

అంతేకాదు ఈ కారులో భద్రతపరంగా కూడా మెరుగైన ఫీచర్స్‌ ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ABS తో కూడిన EBD, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారత్ NCAP టెస్టుల్లో కూడా ఈ కారు మెరుగైన రేటింగ్ సాధించడం విశేషం.

స్టైలిష్ లుక్‌:

ఈ కారు స్టైలిష్ లుక్‌తో ఉంటుంది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, నెక్స్-రే ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 16-అంగుళాల ప్రెసిషన్ కట్ అల్లాయ్ వీల్స్‌తో ఇది ప్రీమియం లుక్ ఇస్తుంది. లోపల 318 లీటర్ల బూట్ స్పేస్ ఉండటం వల్ల ఫ్యామిలీ ట్రిప్స్ కు అవసరమైన లగేజీని తీసుకెళ్లేందుకు వీలుంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి