AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Star Link Internet: ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు ఫ్రీ.. ఎక్కడంటే..?

సంక్షోభంలో కూరుకుపోయిన వెనిజులాకు ఎలాన్ మాస్క్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆ దేశ ప్రజలకు ఉచిత ఇంటర్నెట్ ఆఫర్ చేశారు. వెనిజులా ప్రజలందరూ ఫ్రీగా స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకోచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎలాన్ మాస్క్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Star Link Internet: ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు ఫ్రీ.. ఎక్కడంటే..?
Elon Musk
Venkatrao Lella
|

Updated on: Jan 05, 2026 | 2:16 PM

Share

వెనిజులా, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ఎలాన్ మాస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెనిజులాలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో వెనిజులా ప్రజలు స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. వెనిజులాలో సంక్షోభం నెలకొన్న క్రమంలో ఎలాన్ మాస్క్ ఈ ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. వెనిజులాపై అమెరికా సైనిక చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ కూడా చేశారు. ఈ పరిణామం జరిగిన కొన్ని గంటల్లోనే ఎలాన్ మాస్క్ చేసిన ప్రకటన చర్చనీయాశంగా మారింది.

ఫిబ్రవరి 3 వరకు ఫ్రీ

ఫిబ్రవరి 3వ తేదీ వరకు స్టార్ లింక్ సేవలు వెనిజులా ప్రజలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ఎలాన్ మాస్క్ ప్రకటించారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన క్రమంలో ప్రజలకు కనెక్టివిటీని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వెనిజులా ప్రజలకు సపోర్ట్‌గా ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. సంక్షోభం క్రమంలో ఇంటర్నెట్ కనెక్టివిటీకి అంతరాయం ఏర్పడే అవకాశముంది. ఈ తరుణంలో ఇంటర్నెట్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు స్టార్ లింక్ సేవలు ఉపయోగపడనున్నాయి. మారుమూల గ్రామాల్లో మొబైల్ టవర్లు పనిచేయనప్పుడు స్టార్ లింక్ సేవలు ఉపయోగించుకోవచ్చు.

పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
పండక్కి ఊరెళ్లేందుకు ట్రైన్‌ టిక్కెట్లు దొరకట్లేదా?
పండక్కి ఊరెళ్లేందుకు ట్రైన్‌ టిక్కెట్లు దొరకట్లేదా?
టీ లవర్స్‌కు గుడ్ న్యూస్! ఈ జపాన్ చాయ్ గురించి తెలుసా?
టీ లవర్స్‌కు గుడ్ న్యూస్! ఈ జపాన్ చాయ్ గురించి తెలుసా?
వందే భారత్ రైలు తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే షాకవుతారు!
వందే భారత్ రైలు తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే షాకవుతారు!