Silver Rates: వెండి ధరలపై మరో బిగ్ బాంబ్ పేల్చిన కియోసాకి.. ఎంతవరకు పెరుగుతాయో చెప్పేశారు
వెనిజులా, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే తులం బంగారంపై రూ.1500 వరకు పెరగ్గా.. వెండి ధర రూ.8 వేల వరకు పెరిగింది. ఈ క్రమంలో ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి అంచనా హాట్‌టాపిక్‌గా మారింది.

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత, ప్రముఖ ఇవ్వెస్టర్ రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఫైనాన్షియల్ విషయాల గురించి ఆయన చేస్తే ట్వీట్లు, ఆయన చెప్పే అంచనాలు తెగ పాపులర్ అయ్యాయి. ఆర్ధికపరంగా కియోసాకి సూచనలను తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. రానున్న రోజుల్లో ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉంటాయి..? బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయి..? స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయి..? వేటిపై ఇన్వెస్ట్ చేస్తే మంచిది..? లాంటి ఆర్ధిక విషయాలను ఆయన ముందే పసిగట్టి అంచనా వేస్తూ ఉంటారు. కియోసాకి చెప్పే చాలా విషయాలు నిజమవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆయనను ఫాలో అవుతూ ఇన్వెస్ట్‌మెంట్ గురించి తెలుసుకుంటున్నారు.
వెండి ధరలు ఆల్ టైం రికార్డ్
వెనిజులా-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో రాబర్ట్ కియోసాకి ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. వెండి ధరలు వంద డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేశారు. ఆ తర్వాత అంతకంతకు పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిని సిల్వర్ ధరలు నమోదు చేస్తాయంటూ అంచనా వేశారు. తన అంచనాను వెల్లడించిన కియోసాకి.. మీ అంచనా ఎలా ఉందో చెప్పాలని నెటిజన్లను ప్రశ్నించారు. డాలర్ బలహీనపడటం, వెండిపై పెట్టుబడులు పెరగడంతో వీటి ధరలు పెరుగుతాయంటూ కియోసాకి ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో చేసిన ట్వీట్‌లో వెండి 80 డాలర్లకు చేరుకుంటుందని చెప్పిన ఆయన.. 200 డాలర్లకు కూడా పాకవచ్చని అంచనా వేస్తున్నారు. వెండి బుడగ పగిలిపోతుందా అంటూ అప్పట్లో ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపింది.
2026లో వెండి ధరల అంచనా
2026లో వెండి ధర 100 డాలర్లు దాటుతుందని తాను అంచనా వస్తున్నానని, బహుశా ఔన్సుకు 200 డాలర్లు కూడా కావచ్చని కియోసాకి అంచనా వేస్తున్నారు. వెండి కొనుగోలు చేసినప్పుడు లాభం వస్తుందని, అమ్మినప్పుడు కాదని వ్యాఖ్యానించారు. తెలివైన పెట్టుబడిదారులకు ఓపిక చాలా అవసరమంటూ చెప్పారు. బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టాలని కియోసాని సూచిస్తూ వస్తున్నారు.
I PREDICT:
Silver opens tomorrow at $100 and goes to all time highs.
What do you think?
— Robert Kiyosaki (@theRealKiyosaki) January 4, 2026
