AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IVR IN POSTAL: పోస్టాఫీసుల్లో ఐవీఆర్‌ సేవలు ప్రారంభం…ఎలా పనిచేస్తాయంటే..

పోస్టల్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాదారుల కోసం పోస్టల్‌ విభాగం తాజాగా ఇంటరాక్టివ్‌ వాయిస్‌ ..

IVR IN POSTAL: పోస్టాఫీసుల్లో ఐవీఆర్‌ సేవలు ప్రారంభం...ఎలా పనిచేస్తాయంటే..
India Post
Basha Shek
|

Updated on: Oct 21, 2021 | 4:44 PM

Share

పోస్టల్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాదారుల కోసం పోస్టల్‌ విభాగం తాజాగా ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌(ఐవీఆర్‌) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఈ సేవలను పొందవచ్చని పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. రిజిష్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ద్వారా 18002666868 టోల్ ఫ్రీ నెంబరుకు డయల్‌ చేసి పోస్టల్‌ డిపాజిట్లపై జమవుతోన్న వడ్డీ, బ్యాలెన్స్‌ వివరాలు, డిపాజిట్ల వివరాలు, ఏటీఎమ్‌ కార్డ్‌ బ్లాకింగ్‌, కొత్త కార్డుల జారీ, ఇన్సూరెన్స్‌, పోస్టాఫీస్‌ అందించే వివిధ పథకాల సమస్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్ సర్క్యులర్‌ ప్రకారం పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఎన్‌ఎస్‌సీ వంటి చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టిన కస్టమర్లు కూడా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు.

ఇలా పనిచేస్తుందంటే! తమ వినియోగదారుల కోసం పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ వివిధ భాషల్లో ఐవీఆర్‌ సేవలను అందిస్తోంది. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భాషను ఎంచుకున్న అనంతరం ఐవీఆర్ సూచించిన విధంగా ఎలాంటి సేవలు కావాలంటే దానికి సంబంధించిన బటన్‌ నొక్కితే సమాచారం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు రిజిష్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ద్వారా 18002666868 కు కాల్‌ చేసి 1 నొక్కితే హిందీలో సమాచారం తెలుసుకోవచ్చు. అదే 2 ప్రెస్ చేస్తే ఇంగ్లిష్‌లో సమాచారం తెలుసుకోవచ్చు. ఆతర్వాత 5 నొక్కితే మీకు ఉన్న పోస్టాఫీస్‌ ఖాతాల్లోని బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఏటీఎం కార్డ్‌ బ్లాక్‌ చేసేందుకు 6 ను క్లిక్‌ చేయాలి. ఇతర సేవల కోసం 7 నొక్కాలి. ఇవి కాకుండా ఖాతాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే కస్టమర్‌ కేర్‌కు కనెక్ట్‌ చేయడం చేసి మన సమస్యలను తెలియజేయవచ్చు.

Also Read:

BSNL: ఇకపై విమానాల్లోనూ బ్రాడ్‌ బ్యాండ్ ఇంటర్నెట్‌ సేవలు: అనుమతులు దక్కించుకున్న బీఎస్‌ఎన్ఎల్‌

Multibagger Stock Tips: ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. ఈ షేర్లు మాములుగా లేవుగా.. పెట్టుబడిదారులకు డబ్బులే డబ్బులు!

Apple Watch: యాపిల్ వాచ్ 8 సిరీస్ ప్రత్యేకతలు ఏంటి? లాంఛ్ ఎప్పుడు? వీడియో