Apple Watch: యాపిల్ వాచ్ 8 సిరీస్ ప్రత్యేకతలు ఏంటి? లాంఛ్ ఎప్పుడు? వీడియో
యాపిల్ వాచ్ సిరీస్ 8ను యాపిల్ సంస్థ వచ్చే ఏడాది లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన పనులను యాపిల్ సంస్థ ఇప్పటికే మొదలుపెట్టింది.
యాపిల్ వాచ్ సిరీస్ 8ను యాపిల్ సంస్థ వచ్చే ఏడాది లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన పనులను యాపిల్ సంస్థ ఇప్పటికే మొదలుపెట్టింది. ఇందులో ఉన్న ప్రధాన ప్రత్యేకత ఏంటన్న అంశంపై టెక్ మీడియా వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలయ్యింది. సిరీస్ 8 ప్రత్యేకతలకు సంబంధించిన కొన్ని లీకులు కూడా బయటకు వస్తున్నాయి. యాపిల్ వాచ్ మునుపటి సిరీస్‌లతో పోల్చితే 8 సిరీస్‌లో డిస్ ప్లే సైజు పెద్దదిగా ఉండబోతుందని సమాచారం.మూడు డిస్ ప్లే సైజుల్లో వచ్చే ఏడాది సిరీస్ 8 రానున్నట్లు డిస్‌ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ సీఈవో రోస్ యంగ్ వెల్లడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయంలో ఉన్న యాపిల్ వాచ్ 7 సిరీస్ రెండు సైజుల్లో అందుబాటులో ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: హైదరాబాద్‌లో ఒక్క టీ రూ.1000.. అంత ధర ఎందుకో తెలుసా..?? వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos