Multibagger Stock Tips: ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. ఈ షేర్లు మాములుగా లేవుగా.. పెట్టుబడిదారులకు డబ్బులే డబ్బులు!

నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లోని 15 కాంపోనెంట్‌లలో 10 స్టాక్స్ గత సంవత్సరంలో మల్టీ-బ్యాగర్లుగా నిరూపించబడ్డాయి. 100 శాతం నుంచి 400 శాతం మధ్య పెరిగి పెట్టుబడిదారులను ధనవంతులను చేశాయి.

Multibagger Stock Tips: ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. ఈ షేర్లు మాములుగా లేవుగా.. పెట్టుబడిదారులకు డబ్బులే డబ్బులు!
Multibagger Stocks
Follow us
Venkata Chari

|

Updated on: Oct 21, 2021 | 10:29 AM

Multibagger Stocks: నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లోని 15 కాంపోనెంట్‌లలో 10 స్టాక్స్ గత సంవత్సరంలో మల్టీ-బ్యాగర్లుగా నిరూపించబడ్డాయి. 100 శాతం నుంచి 400 శాతం మధ్య పెరిగి పెట్టుబడిదారులను ధనవంతులను చేశాయి. మెటల్ స్టాక్స్ గత ఏడాది కాలంగాగా ఎంతో రాబడిని అందిస్తున్నాయి. ఈ కాలంలో నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లో 150 శాతానికి పైగా లాభంతో పోలిస్తే బెంచ్‌మార్క్ నిఫ్టీ కేవలం 55 శాతం మాత్రమే పెరిగింది. కోవిడ్ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ ఓపెన్ కావడంతో పెరుగుతున్న డిమాండ్ మధ్య బేస్ మెటల్ ధరల పెరుగుదల కారణంగా మెటల్ ఇండెక్స్‌లో ఇలాంటి ధోరణి ఏర్పడింది. మెటల్ ధరల పెరుగుదల సాక్షాత్కారాలను ఇవి మరింతగా పెంచుతున్నాయి. దీంతో ఈ స్టాక్స్ అధిక రాబడిని అందిస్తున్నాయి.

ఇవే కాకుండా, రియల్ ఎస్టేట్, ఆటోమెబైల్ వంటి అనేక రంగాలు లోహ రంగంపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. సంబంధిత రంగాలలో డిమాండ్ పెరుగుదల కూడా మెటల్ కంపెనీలకు ప్రయోజనకరంగా మారింది. స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులు మొదలైన వాటిపై దృష్టి సారించడంతో భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా మెటల్ స్పేస్ కోసం డిమాండ్ కొనసాగుతుంది. దీంతో ఈ రంగంలో మంచి పెట్టుబడికి అవకాశంగా మారుతుంది.

గత సంవత్సరం నిఫ్టీ మెటల్ ఇండెక్స్ పనితీరు కూడా ఈ రంగంలో పెట్టుబడిదారుల పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. ఇది బెంచ్ మార్క్ నిఫ్టీనే కాకుండా ఇతర రంగాలను కూడా అధిగమించింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లోని 15 కాంపోనెంట్లలో, 10 స్టాక్స్ గత సంవత్సరంలో మల్టీ-బ్యాగర్లుగా మారాయి. 100 శాతం నుంచి 400 శాతం మధ్య కదులుతున్నాయి.

గతేడాదిలో అత్యుత్తమ పనితీరు కలిగిన మెటల్ స్టాక్స్:

అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises): ఈ స్టాక్ గత సంవత్సర కాలంలో నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లో ఉత్తమ పనితీరు కనబరిచింది. ఈ కాలంలో 400 శాతానికి పైగా లాభపడింది.

హిందుస్థాన్ కాపర్ (Hindustan Copper): ఈ స్టాక్ గతేడాదిలో 300 శాతానికి పైగా, అలాగే 2021లో 136 శాతానికి పైగా పెరిగింది.

నాల్కో(NALCO): నాల్కో స్టాక్ గత సంవత్సరంలో 260 శాతం పెరిగింది. 2021 లో 150 శాతానికి పైగా పెరిగింది.

వేదాంత(Vedanta): గతేడాదిలో ఈ స్టాక్ 250 శాతానికి పైగా పెరిగింది. 2021 లో 120 శాతానికి పైగా పెరిగింది.

సెయిల్ (SAIL): గతేడాది ఈ స్టాక్ దాదాపు 240 శాతం పెరిగింది. 2021 లో 60 శాతానికి పైగా పెరిగింది.

ఇవి కాకుండా, టాటా స్టీల్ 230 శాతం, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ 195 శాతం, హిందాల్కో 175 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌పీఎల్ గతేడాదిలో 110 శాతానికి పైగా పెరిగి లాభాల పంట పండిచాయి.

నిఫ్టీ మెటల్స్ ఇండెక్స్‌లోని మిగిలిన ఐదు స్టాక్స్ – ఎన్‌ఎండీసీ, రత్నమణి మెటల్స్, కోల్ ఇండియా, హింద్ జింక్, వెల్స్పన్ కార్ప్ – తమ పెట్టుబడిదారులకు 20 శాతం నుంచి 75 శాతం మధ్య పాజిటివ్ డబుల్ డిజిట్ రిటర్న్‌లను అందించాయి.

Also Read: Car Safety Features: కారు భద్రతకు ఈ ఫీచర్లు ఎంతో అవసరం.. మీ కారులో ఇవి ఉన్నాయా మరి..!

Silver Rate Today: బంగారం బాటలోనే వెండి.. స్వల్పంగా పెరిగిన సిల్వర్‌ రేట్‌.. ఎంత పెరిగిందంటే..