Car Safety Features: కారు భద్రతకు ఈ ఫీచర్లు ఎంతో అవసరం.. మీ కారులో ఇవి ఉన్నాయా మరి..!

మీ కారులో ఈ ఫీచర్లు ఉంటే మీరు మరింత సురక్షితంగా ఉంటారు. ఈ ఫీచర్లు మిమ్మల్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా మీకు హెచ్చరికలు కూడా చేస్తాయి. దాంతో మీరు మరింత అప్రమత్తంగా ఉంటారు.

Car Safety Features: కారు భద్రతకు ఈ ఫీచర్లు ఎంతో అవసరం.. మీ కారులో ఇవి ఉన్నాయా మరి..!
Car Safety Features
Follow us
Venkata Chari

|

Updated on: Oct 21, 2021 | 8:53 AM

Car Safety Features: వాహన తయారీదారులు ప్రస్తుతం భద్రకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ముఖ్యంగా కారు భద్రతకు సరికొత్త ఫీచర్లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం కార్లలో మునుపటి కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు చేర్చుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ఫీచర్లు మిమ్మల్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా ప్రమాదాలకు ముందు అలర్ట్ చేస్తాయి. మీ కారులో ఈ ఫీచర్లు ఉంటే మీరు మరింత సురక్షితంగా ఉంటారు. అవేంటో చూద్దాం..

టైర్ ఒత్తిడి పర్యవేక్షణ వ్యవస్థ ఈ ఫీచర్ కారును సురక్షితంగా ఉంచడానికి కూడా పనిచేస్తుంది. ఈ వ్యవస్థ కారుకు ఉన్న నాలుగు టైర్లను పర్యవేక్షిస్తుంది. గాలి ఒత్తిడి, టైర్ల ఉష్ణోగ్రత గురించి మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. టైర్‌లో ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే, వెంటనే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించే అవకాశం ఉంది.

డోర్ లాక్ అలారం కారు తలుపును సరిగ్గా లాక్ చేయడం ముఖ్యం. లేకుంటే ప్రయాణంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కారు డోర్ లాక్ చేయబడకపోతే డోర్ లాక్ అలారం మోగడం ప్రారంభమవుతుంది. డోర్ లాక్ అయ్యే వరకు ఇది కొనసాగుతుంది.

వేగ హెచ్చరిక వ్యవస్థ మీరు నిర్దేశించిన పరిమితిని మించిన వేగంతో కారును నడిపితే ఈ వ్యవస్థ పనిచేస్తుంది. హై స్పీడ్‌లో వెళ్తుంటే అలారం మోగడం ప్రారంభమవుతుంది. దీంతో మిమ్మల్ని హెచ్చరించడానికి పని చేస్తుంది.

సీటు బెల్ట్ అలారం ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముందు సీటులో కూర్చున్న డ్రైవర్ లేదా ప్యాసింజర్ సీట్ బెల్ట్ ధరించనప్పుడు సీట్ బెల్ట్ అలారం యాక్టివేట్ అవుతుంది. ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి సీట్ బెల్ట్ బిగించే వరకు ఈ అలారం మోగుతూనే ఉంటుంది. భద్రత దృష్ట్యా సీట్ బెల్ట్ ధరించడం చాలా ముఖ్యం. సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల ప్రమాద సమయంలో తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉంది.

Also Read: Xiaomi Electric Vehicles: మరో సంచలనానికి తెర తీస్తోన్న షావోమీ.. ఈసారి ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా..

Future Tech 2021: భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో ఫ్యూచర్ టెక్ 2021 ఈవెంట్.. ఆన్‌లైన్‌లో మీరూ పాల్గొనవచ్చు ఇలా!