Xiaomi Electric Vehicles: మరో సంచలనానికి తెర తీస్తోన్న షావోమీ.. ఈసారి ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా..

Xiaomi Electric Vehicles: స్మార్ట్‌ ఫోన్‌ రంగంలో పెను సంచలనంలా దూసుకొచ్చింది షావోమీ. చైనాకు చెందిన ఈ ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరిస్తూ పోతోంది...

Xiaomi Electric Vehicles: మరో సంచలనానికి తెర తీస్తోన్న షావోమీ.. ఈసారి ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా..
Mi Electric Cars
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 21, 2021 | 8:32 AM

Xiaomi Electric Vehicles: స్మార్ట్‌ ఫోన్‌ రంగంలో పెను సంచలనంలా దూసుకొచ్చింది షావోమీ. చైనాకు చెందిన ఈ ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరిస్తూ పోతోంది. తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లను అందిస్తూ యూజర్లను అట్రాక్ట్‌ చేసిందీ సంస్థ. ఇప్పటి వరకు షావోమీ నుంచి స్మార్ట్‌ ఫోన్‌ నుంచి ట్రిమ్మర్‌ వరకు అన్ని రకాల గ్యాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చైనా దిగ్గజ సంస్థ మరో సంచలనానికి తెర తీసింది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై దృష్టిసారించిన షావోమీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఈ విషయమై తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం బాగా పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం ప్రోత్సాహాలు అందిస్తుండడం, రాయితీలు ప్రకటిస్తుండడంతో ఈ రంగంలోకి బడా సంస్థలు సైతం ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే యాపిల్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించగా.. ఇప్పుడు షావోమీ కూడా ఆ దిశలో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే 2024 ప్రథమార్థంలో ఎలక్ట్రిక్‌ కార్లను లాంచ్‌ చేయనున్నట్లు షావోమీ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ విషయమై షావోమీ సీఈఓ మాట్లాడుతూ.. ‘2024లో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్‌ కార్లను షావోమీ ఉత్పత్తి చేయనుంది. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో వచ్చే పదేళ్లలో సుమారు 10 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నాము’ అని చెప్పుకొచ్చారు. మరి తక్కువ ధరలో స్మార్ట్‌ ఫోన్‌లను పరిచయం చేసిన షావోమీ.. వాహనాల్లోనూ ఇదే పంథాను కొనసాగిస్తుందా చూడాలి. ఇదిలా ఉంటే షావోమీ ఇలా ప్రకటన చేసిందో లేదో.. ఒక్కసారిగా కంపెనీ షేర్ విలువ పెరిగిపోయింది.

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. నేడు ఏ రాశివారికి ఏవిధంగా ఉన్నదంటే..

Ambati: కుట్ర అంతటికీ సూత్రధారైన చంద్రబాబును అరెస్ట్ చేసి విచారించాలి: అంబటి రాంబాబు

Gold Rates Today: క్రమంగా పెరుగుతోన్న బంగారం ధరలు.. దీపావళి వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతుందా.?