Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. నేడు ఏ రాశివారికి ఏవిధంగా ఉన్నదంటే..

Horoscope Today (October 21-10-2021): ఈరోజులో ఏపని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలుచేయలన్నా జాతకాలు, రాశిఫలాలను చూస్తారు. వీటి ఆధారంగా పనులు మొదలు పెట్టేవారు..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. నేడు ఏ రాశివారికి ఏవిధంగా ఉన్నదంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Oct 21, 2021 | 7:25 AM

Horoscope Today (October 21-10-2021): ఈరోజులో ఏపని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలుచేయలన్నా జాతకాలు, రాశిఫలాలను చూస్తారు. వీటి ఆధారంగా పనులు మొదలు పెట్టేవారు చాలామంది ఉన్నారు. జాతకాలను విశ్వసిస్తూ పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది ఈరోజు తమ జాతకం ఎలా ఉంది అంటూ.. తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 21న ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారికి ఈరోజు చేపట్టిన పనులను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. శ్రమతో కూడిన విజయం సొంతం చేసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

వృషభ రాశి: ఈ రాశివారికి ఈరోజు అవసరంలో తగిన సాయం అందుకుంటారు. అనవసర వివాదాల జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది. అనుకున్నది సాధించేవరకూ పట్టుదలతో ఉండాల్సి ఉంటుంది.

మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు చేపట్టిన పనులు సత్పలితాలను ఇస్తాయి. మాట అదుపులో ఉంచుకోవడం మంచింది. కార్య సిద్ధి ఉంది.

కర్కాటక రాశి: ఈ రాశివారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగ రంగాలవారు మంచి ఫలితాలను పొందుతారు. భవిష్యత్ కోసం చేసే ఆలోచనలు మేలు చేస్తాయి. స్నేహితులు, సన్నిహితుల సహాయంతో అనుకున్నది సాధిస్తారు.

సింహ రాశి: ఈరోజు ఈరాశివారికి వ్యాపార రంగంలోని వారు తమకు ఎదురైన ఆటంకాలను అధిగమించాల్సి ఉంటుంది. శుభావార్తను వింటారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్ధికంగా మంచి లాభాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో మంచి పేరుని పొందుతారు.

తులా రాశి: ఈ రాశివారికి ఈరోజు కొత్తపనులను చేపడతారు. సుభాఫలితలను అందుకుంటారు.బంధు మిత్రులను కలుపుకొనిపోవడం వల్ల శీఘ్ర ఫలితాలు సొంతం చేసుకుంటారు.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. కొత్తపనులు చేపట్టేముందు అలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. కొత్తపనులు ప్రారంభించే ముందు తగిన విధంగా సన్నాహాలు చేసుకోవడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని పనిచేయాల్సి ఉంటుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. అప్పుల బాధలు ఎదురవుతాయి. నిరుత్సాహపరిచే సంఘటనలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మీన రాశి: ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. ప్రతిభకు తగిన ఫలితం అందుకుంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు.

Also Read:  సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగుబాటు.. వారిలో 9 మంది మహిళలు