Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambati: కుట్ర అంతటికీ సూత్రధారైన చంద్రబాబును అరెస్ట్ చేసి విచారించాలి: అంబటి రాంబాబు

టీడీపీ నాయకుడు పట్టాభిని మాత్రమే కాకుంటా, ఈ మొత్తానికి కపటనాటక సూత్రధారి చంద్రబాబును కూడా అరెస్టు చేయాల్సిందిగా, విచారణ చేయాల్సిందిగా

Ambati: కుట్ర అంతటికీ సూత్రధారైన చంద్రబాబును అరెస్ట్ చేసి విచారించాలి: అంబటి రాంబాబు
Ambati Demands Chandrababu
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 21, 2021 | 7:14 AM

Ambati Rambabu – Chandrababu: టీడీపీ నాయకుడు పట్టాభిని మాత్రమే కాకుంటా, ఈ మొత్తానికి కపటనాటక సూత్రధారి చంద్రబాబును కూడా అరెస్టు చేయాల్సిందిగా, విచారణ చేయాల్సిందిగా వైసీపీ ఎమ్మెల్యే, ఆపార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. ఈ కుట్ర అంతటికీ కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబును పూర్తిస్థాయిలో విచారిస్తేనే అసలు విషయాలు బయటకు వస్తాయని అంబటి అభిప్రాయపడ్డారు. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు సంబంధించిన అనేక అంశాలు బయటకు వస్తాయని, నమ్ముతూ తక్షణం చంద్రబాబను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏపీ సీఎం వైయస్ జగన్‌పై.. తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడి చేశారు. అనంతరం రాష్ట్రంలో పరిస్థితులు రణరంగంగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత పట్టాభిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా గొడవలకు కారణమైన పట్టాభిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పోలీసులు పట్టాభి ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగులగొట్టి పోలీసులు పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య పట్టాభిని ఇంటి దగ్గరి నుంచి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో పట్టాభిపై సెక్షన్ 153ఏ, 505 (2), 505 (r/w), 120బి కింద కేసు నమోదు చేశారు.

కాగా.. పట్టాభి అరెస్టు అనంతరం ఆయన భార్య చందన మీడియాతో మాట్లాడారు. ఎఫ్ఐఆర్ కాపీ చూపెట్టకుండా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఆయనకు ఎం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ఆమె పేర్కొన్నారు. పట్టాభిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదని తెలిపారు. తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని.. దీనిపై కోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు.

Read also: Chandrababu: మరికాసేపట్లో ప్రారంభం కానున్న టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష