Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మంటల కొనసాగుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..
Petrol Price
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 21, 2021 | 8:39 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మంటల కొనసాగుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ హెచ్చు తగ్గులు కనిపించాయి. గురువారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం ధరల్లో మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.82గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 103.94గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.95గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.103.72గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 111.41గా ఉండగా.. డీజిల్ ధర రూ. 104.05గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.25గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.34గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.82 ఉండగా.. డీజిల్ ధర రూ.103.94గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.54 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.103.67గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.112.90 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.42 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.112.39 ఉండగా.. డీజిల్ ధర రూ. 104.90గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.39లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.104.89గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.39గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.94గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 112.90 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.105.29లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 106.54 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 94.92 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.44కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.89 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.107.11 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 98.03 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 103.71 ఉండగా.. డీజిల్ ధర రూ.99.26గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.110.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.101.12గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.52 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.72గా ఉంది.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: మీ బాధలను అందరితో పంచుకుంటున్నారా.. మొదటికే మోసం.. చాణక్యుడు చెప్పింది తెలిస్తే ఇకపై ఆ పని చేయరు..

Tirumala Devasthan Tickets: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీలను ప్రకటించిన టీటీడీ