Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మీ బాధలను అందరితో పంచుకుంటున్నారా.. మొదటికే మోసం.. చాణక్యుడు చెప్పింది తెలిస్తే ఇకపై ఆ పని చేయరు..

జీవింతంలో విజయం ఎలా సాధించాలి..? ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటే మనం విజయం సాధిస్తాం..? ఎలాంటివాటి లక్షణాలను మనం పక్కన పెట్టాలి..?

Chanakya Niti: మీ బాధలను అందరితో పంచుకుంటున్నారా.. మొదటికే మోసం.. చాణక్యుడు చెప్పింది తెలిస్తే ఇకపై ఆ పని చేయరు..
Chanakya
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 21, 2021 | 7:28 AM

జీవింతంలో విజయం ఎలా సాధించాలి..? ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటే మనం విజయం సాధిస్తాం..? ఎలాంటివాటి లక్షణాలను మనం పక్కన పెట్టాలి..? నిత్య జీవితంలో ఎలాంటి మనం అనుసరించాలనే అంశంపై ఆచార్య చాణక్యుడు క్లు తనపై ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకోకూడదని ఇతరుల అనుభవాల నుండి నేర్చుకోవాలని తన నీతి గ్రంధంలో పేర్కొన్నాడు. మీరు మీ మీద ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు మీ వయస్సు సరిపోదని తెలిపారు. మీరు నిజంగా జీవితంలో పెద్ద పనులు చేయాలనుకునేవారు.. పెద్ద లక్ష్యాలను సాధించాలనుకునేవారు.. ఇతరుల తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలన్నారు. మీరు గొయ్యిలో పడే వరకు వేచి ఉండటం సరికాదన్నారు. అలా చేస్తే మీ జీవితంలో ఎన్నిటికీ లక్ష్యాన్ని చేరుకోలేదు. 

మీ జీవితంలోని అన్ని సమస్యలను నివారించడం ద్వారా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలని అంటారు ఆచార్య చాణక్యుడు. ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం అనే పుస్తకంలో ముందు తరాలకు ఉపయోగపడేలా వ్రాసారు. ఈ నిగూఢమైన విషయాలు మీకు దశలవారీగా సహాయపడతాయి. ఆ రెండు అలవాట్ల గురించి ఇక్కడ తెలుసుకోండి. ఆచార్య ఏ ధరకైనా మారాలని సూచించాడు, లేకుంటే మీరు వేధింపులకు గురవుతారని హెచ్చరిస్తాడు.

1. ‘నిటారుగా నిలబడిన చెట్టు మొదట నరికివేయబడినట్లే.. అదే విధంగా సూటిగా ఉండే వ్యక్తిని మొదట మోసం చేస్తారు’ – ఆచార్య చాణక్యుడు

సూటిగా, సరళంగా ప్రవర్తించకూడదని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో విశ్వసించారు. అలా చేస్తే మీ చుట్టు ఉండేవారు మిమ్మల్ని సద్వినియోగం చేసుకోవడం మొదలు పెడతారు. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా చాలా మంచివారు.. కానీ ఈ ప్రపంచం వారిని అలా తీసుకోదు. అందువల్ల.. తన చుట్టూ ఉండే మోసగాళ్ల నుండి తనను తాను రక్షించుకుంటూ తన కుటుంబాన్ని కాపాడుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు. మీరు సూటిగా ఉండే స్వభావాన్ని మార్చుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంది. దశల వారీగా మిమ్మల్ని వేధించేవారు పెరిగిపోతారు. అంతే కాదు ఈ అవకాశాన్ని ఉపయోగిచుకుని మోసం కూడా చేస్తారు. మీ కుటుంబం కూడా దీని భారాన్ని భరించాల్సి ఉంటుంది. నిటారుగా ఉన్న చెట్టును ముందుగా నరికివేయాలని చూస్తారు.  అలాగే సూటిగా ఉండే వ్యక్తిని ముందుగా అడ్డు తొలిగించుకోవాలని ఎవరైనా చూస్తారు. కాబట్టి ఎవరైనా మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టేలా సూటిగా ఉండకండి.

2. ‘ కూలిపోయన ఇంటి  నుంచి ఇటుకలను ఎత్తుకపోతారు.. మీ బాధలను ఎదుటివారితో పంచుకోవద్దు’ – ఆచార్య చాణక్యుడు

ఆచార్య మీపై ఎంత పెద్ద కష్టాల పర్వతం విరిగిపడినా.. మీ లోపల ఎంత దుఖంతో ఉన్నా.. మీ మానసిక స్థితిని ఎవరికీ చెప్పకండి అని అంటారు. నిజ జీవితంలో మీ సమస్యను అర్థం చేసుకోగల వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారని అంటారు. వాస్తవానికి ప్రజలు మీ మనస్సులోని బలహీనతను అర్థం చేసుకోకపోవడమే కాకుండా.. ఇదే అవకాశంగా భావించి వారికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కూలిన ఇంటి నుంచి ఇటుకలను ఎత్తుకపోయినట్లుగానే..  మీ బలహీనమైన మానసిక స్థితిని మరింత నాశనం చేయగలరని ఆచార్యుడు నమ్ముతారు.

అయితే మనుషులందరూ ఇలా ఉంటారని.. ఉండరని కూడా చెప్పలేమంటారు. మన చుట్టూ ఉండేవారిలో కొందరు మంచివారు కూడా ఉంటారని అంటారు. మీకు ఎవరిపై పూర్తి నమ్మకం లేకపోతే మీ బాధను ఎవరికీ చెప్పకండని చాణక్య నీతిలో శాస్త్రంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Aryan Khan: షారుఖ్‌కు మరో షాక్ .. ఆర్యన్ ఖాన్‌‌కు దొరకని బెయిల్.. నిరాశలో అభిమానులు..

Jammu and Kashmir: కశ్మీర్‌లో రెచ్చిపోతున్న ఉగ్రమూకలు.. సంచలన కామెంట్స్ చేసిన ఆర్మీ అధికారి..