Jammu and Kashmir: కశ్మీర్‌లో రెచ్చిపోతున్న ఉగ్రమూకలు.. సంచలన కామెంట్స్ చేసిన ఆర్మీ అధికారి..
Jammu and Kashmir: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల రాజ్యం ఏర్పడిన తరువాత.. కశ్మీర్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రమూకలు చెలరేగిపోతున్నాయి.
Jammu and Kashmir: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల రాజ్యం ఏర్పడిన తరువాత.. కశ్మీర్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రమూకలు చెలరేగిపోతున్నాయి. కశ్మీర్‌లో సాధారణ పౌరులను కాల్చి చంపుతున్నారు. అయితే, గత కొంతకాలంగా.. కశ్మీర్ ప్రజలు తీవ్రవాద మార్గాన్ని అనుసరిస్తున్నట్లు అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామాలపై ఆర్మీకి చెందిన ఓ ఉన్నతాధికా ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ ప్రజల్లో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. తన ప్రసంగం ద్వారా కశ్మీర్ ఔన్నత్యం ఏంటో ప్రజలకు వివరించారు. కశ్మీర్ ప్రజలకు తమ సంప్రదాయం ఏంటి? తమ కల్చర్ ఏంటి? అనే విషయాలను గుర్తు చేస్తూ.. మంచి మార్గంలో పయనించాలంటూ సూచించారు. ఆయనే ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్.
తాజాగా శ్రీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్‌పుతానా రైఫిల్స్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రభావానికి గురై.. కశ్మీర్ కల్చర్‌ని నాశనం చేయొద్దని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘పశ్చిమ దేశాలలోని విమానాశ్రయాలలో తనిఖీ చేస్తున్నప్పుడు ‘పాకీ’(పాకిస్తానీ) అని పిలవడం ఒక అపవాదుగా విదేశీయులు భావిస్తారు. అలాంటి అపవాదు కశ్మీరీలకు కావాలా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘మీరు పాకిస్తాన్ లాంటి సమాజం కావాలనుకుంటున్నారా? అవమానానికి గురవ్వాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించారు. ‘ఎవరు ఓడిపోయారు? మా కశ్మిరీ తల్లి ఎవరి తమ పిల్లలను మదర్సాలోకి బందీగా నెడుతోంది? ఏడాదిలోపే ప్రాణాలు కోల్పోయేలా చేస్తోందెవరు?. 90 లలో ఏర్పడిన ఈ వ్యవస్థ ఆమె కొడుకుని విద్యావంతుడిగా మారకుండా.. ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయేలా చేసింది.’’ అని అన్నారు.
ఇదే సమయంలో కశ్మీర్‌కు సంబంధించి గొప్ప సంప్రదాయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘కశ్మీర్‌కు 5వేల సంవత్సరాల చరిత్ర ఉంది. శాంతి, సహనం, మానవత్వం, సహజీవనానికి పెట్టింది పేరు కశ్మీర్. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం జమ్మూకశ్మీర్ సొంతం. కానీ, ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయా? కశ్మీరీ అనే ముసుగులో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కశ్మీరీ అని చెప్పుకుంటూ ఆ పేరును దుర్వినియోగపరుస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.
‘ఎంత మంది ఘాజీలు వచ్చారు, ఎంత మంది ఘాజీలు వెళ్లారు’.. లెఫ్టినెంట్ జనరల్ కేజేస్ థిల్లాన్.. హిజ్బుల్ వంటి తీవ్రవాద సంస్థలకు సింహస్వప్నంలా నిలుస్తున్నారు. 2020లో హిజ్బుల్ ముజాహిద్దీన్ కాశ్మీర్ కొత్త కమాండర్‌గా ఘాజీ హైదర్‌ను నియమించింది. ఆ సమయంలో రియాక్ట్ అయిన లెఫ్టినెంట్ జనరల్.. ‘కిత్నే ఘాజీ ఆయే ఔర్ కిత్నే ఘాజీ గయే'(ఎంత మంది ఘాజీలు వచ్చారు, ఎంత మంది ఘాజీలు వెళ్లారు) అంటూ సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు. కాగా, కేజేఎస్ థిల్లాన్ కెరియర్‌లో.. చాలా మంది ఉగ్రవాదులను అంతమొందించారు. చినార్ కార్ప్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో అనేక మంది ఉగ్రవాదులను ఏరిపారేశారు. కశ్మీర్ లోయలో కమాండర్‌గా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, చొరబాబు నిరోధక కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. పుల్వామా దాడి సమయంలో కూడా శ్రీనగర్‌లోని ఆర్మీ 15వ దళానికి కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనేక కీలక ఆపరేషన్‌లలో కీలక పాత్ర పోషించారు.
#WATCH: Who is the loser? Our Kashmiri mother whose child was pushed into madrassa & died within a day, year. The system which came into being after 90s, took her son away either by not educating him or by getting him killed in encounter:Lt Gen KJS Dhillon, Col, Rajputana Rifles pic.twitter.com/WbuuCpWNM3
— ANI (@ANI) October 20, 2021
Also read:
Telangana News: ఇదేం పిట్టరా బాబోయ్.. హెల్మెట్ ఉంటేనే పెరట్లోకి వెళ్లాలి.. లేదంటే అంతే సంగతి..!
TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..